ఏపీ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 309 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామ, వార్డు వలంటీర్ల నియామకం జరగనుంది. పది, ఇంటర్ పాసై జిల్లాకు చెందిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా సెలెక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
జూన్ 3వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://gswsvolunteer.apcfss.in/ లేదా https://apgv.apcfss.in/ వెబ్ సైట్ల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పది, ఇంటర్ పాసై స్థానికంగా నివాసం ఉండేవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వాళ్లకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలి.
ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై పరిజ్ఞానం ఉండటంతో పాటు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 100 మార్కులకు ఇంటర్వ్యూ ఉండగా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి 5,000 రూపాయల వేతనం లభిస్తుంది.
వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. కరోనా కష్ట కాలంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More