https://oktelugu.com/

jobs: అనంతపురం జిల్లాలో అంగన్ వాడీ ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

jobs: ఏపీకి చెందిన మహిళా, శిశు అభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 365 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకుల ఉద్యోగ ఖళీలను ఈ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 9, 2021 11:16 am
    Follow us on

    jobs: ఏపీకి చెందిన మహిళా, శిశు అభివృద్ధి సంస్థ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. మొత్తం 365 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది.

    jobs

    jobs

    అంగన్‌వాడీ కార్యకర్త, మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకుల ఉద్యోగ ఖళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి పాసై పెళ్లైన మహిళలు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 2021 సంవత్సరం జులై నెల 1వ తేదీ నాటికి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: భారత ఆర్మీలో భారీగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే?

    ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సీడీపీఓలు నిర్వహించే డిక్టేషన్‌, ఇతర వివరాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు 11,500 రూపాయలు, మినీ అంగన్ వాడీ కార్యకర్తకు నెలకు 7000 రూపాయలు, అంగన్‌వాడీ సహాయకులకు నెలకు 7,000 రూపాయల చొప్పున వేతనం చెల్లిస్తారు.

    2021 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://ananthapuramu.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

    Also Read: డిగ్రీ పాసైన విద్యార్థులకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్?