అనంత‌పురం జిల్లా జైలులో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా జైలుకు సంబంధించి పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. జైళ్ల శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ ఉద్యోగ నియామకాలు జరనున్నాయని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పారామెడిక‌ల్ స్టాఫ్‌, ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టుల‌ భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 6 పోస్టుల రిక్రూట్ మెంట్ జరగనుందని సమాచారం. రేపటితో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గడువు ముగియనుందనే సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ […]

Written By: Navya, Updated On : June 14, 2021 9:54 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లా జైలుకు సంబంధించి పలు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. జైళ్ల శాఖ ఆధ్వ‌ర్యంలో ఈ ఉద్యోగ నియామకాలు జరనున్నాయని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పారామెడిక‌ల్ స్టాఫ్‌, ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టుల‌ భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. కాంట్రాక్ట్ విధానంలో మొత్తం 6 పోస్టుల రిక్రూట్ మెంట్ జరగనుందని సమాచారం.

రేపటితో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు గడువు ముగియనుందనే సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫార్మసిస్ట్ (01), ల్యాబ్‌ టెక్నీషియన్ (01), మేల్‌ నర్సింగ్ (02), ఫీమేల్‌ నర్సింగ్ (01), ఎలక్ట్రీషియన్ (01) ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. ఫార్మ‌సిస్ట్ గ్రేడ్ – 2 ఉద్యోగ ఖాళీలకు ఫార్మ‌సీ/బీఫార్మ‌సీ విబాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం.

ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో వివరాలు నమోదు చేసుకున్న వాళ్లు మాత్రమే ఫార్మ‌సిస్ట్ గ్రేడ్ – 2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, డీఎంఎల్‌టీ/బీఎస్సీ, ఎంఎల్‌టీ ఉత్తీర్ణతతో పాటు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ లో దరఖాస్తు చేసుకున్న వాళ్లు ల్యాబ్ టెక్నీషియ‌న్ గ్రేడ్ – 2 పోస్టుల‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. పదో తరగతి ఉత్తీర్ణత‌తో పాటు ప్రాథమిక చికిత్స ధృవపత్రం ఉంటే మేల్, ఫీమేల్‌నర్సింగ్‌ గ్రేడ్‌–2 పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

ఎల‌క్ట్రిక‌ల్ విభాగంలో ఐటీఐలో ఉత్తీర్ణ‌త సాధించిన వాళ్లు ఎల‌క్ట్రీషియ‌న్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ఈ నెల 15వ తేదీతో ముగియనుంది. పూర్తి వివ‌రాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తును అనంత‌పురం, సూపరిండెంట్, జిల్లా జైలు అడ్ర‌స్‌కు పంపించాల్సి ఉంటుంది. https://ananthapuramu.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.