https://oktelugu.com/

Jobs: ఎయిమ్స్ మంగళగిరిలో రీసెర్చ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు.. నెలకు రూ.56,000 వేతనంతో?

Jobs: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో రీసెర్చ్ సైంటిస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు, ల్యాబొరేటరీ టెక్నీషియన్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 20, 2022 / 11:41 AM IST
    Follow us on

    Jobs: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 7 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

    Jobs

    ఈ ఉద్యోగ ఖాళీలలో రీసెర్చ్ సైంటిస్టులు, రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు, ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని తెలుస్తోంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.

    Also Read: Lic Policy: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. ఏడాదికి సులువుగా 55,000 రూపాయలు పొందే ఛాన్స్!

    aiimsmangalagiri.edu.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 18,000 రూపాయల నుంచి 56,000 రూపాయల వరకు వేతనంగా లభించనుందని సమాచారం అందుతోంది.

    పదో తరగతి నుంచి ఎంబీబీఎస్ వరకు అర్హత ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

    Also Read: Taapsee Pannu: తాప్సీ క్లారిటీ ఇచ్చింది.. కానీ ఉపయోగం ఏముంది ?

    Recommended Videos: