
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రతిభ ఉండి ఆర్థికపరమైన కారణాల వల్ల చదువుకు దూరమవుతున్న విద్యార్థినులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రగతి పేరుతో ఏఐసీటీఈ విద్యార్థినుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఏఐసీటీఈ దరఖాస్తు చేసుకున్న వాళ్లలో 10,000 మంది ఈ స్కాలర్ షిప్ ద్వారా ప్రయోజనం పొందే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటికే ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 31 దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది.
Also Read: ఏపీలో డీఎస్సీ రాసేవాళ్లకు అలర్ట్.. ఆ సిలబస్ లో మార్పు..?
ఏఐసీటీఈ ఈ స్కాలర్ షిప్ ద్వారా విద్యార్థినులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. డిప్లొమా ఫస్ట్ ఇయర్, లేటరల్ ఎంట్రీ డిప్లొమా సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, లేటరల్ ఎంట్రీ బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందడానికి అర్హులు. విద్యార్థులు కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి సంవత్సరం 50 వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ లకు రాష్ట్రాల వారీ కోటా ఉంటుంది.
Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. రెండు కీలక నిర్ణయాలు..?
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంజనీరింగ్ చదువుతున్న 566 మంది, డిప్లొమా చదువుతున్న 318 మంది విద్యార్థినులు, తెలంగాణ నుంచి ఇంజనీరింగ్ చదువుతున్న 206 మంది, ఇంజనీరింగ్ చదువుతున్న 424 మందికి ఈ స్కాలర్ షిప్ లు దక్కుతాయి. డిప్లొమా విద్యార్థినులకు పదో తరగతి మార్కుల ఆధారంగా, ఇంజనీరింగ్ విద్యార్థినులకు ఇంటర్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు
ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన డిప్లొమా లేదా ఇంజనీరింగ్ కాలేజీలో చేరితే మాత్రమే ఈ స్కాలర్ షిప్ ను పొందవచ్చు. https://scholarships.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.