RRC SWR Recruitment 2021: సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 904 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు భారతీయ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిట్టర్, కార్పెంటర్ ఉద్యోగ ఖాళీలతో పాటు ఎలక్ట్రీషియన్, వెల్డర్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 3వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.

భారీ సంఖ్యలో అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం గమనార్హం. పది అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఏపీలోని చిత్తూరు, అనంతపూర్ మహారాష్ట్ర రాష్ట్రంలోని సంగ్లీ, తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు, సేలం, ధర్మపురి, కర్ణాటక, గోవాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వేర్వేరు ఉద్యోగ ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలు ఉండగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు అభ్యర్థులు ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://jobs.rrchubli.in/actapprentice2021-22/ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్ సైట్ లో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను క్లిక్ చేసి బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోటో, సంతకం, అవసరమైన ధృవపత్రాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ ను సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసి భద్రపరుచుకుంటే మంచిది.