NBCC Recruitment: ఎన్‌బీసీసీలో 70 ఉద్యోగ ఖాళీలు.. నెలకు లక్షన్నరకు పైగా వేతనంతో?

NBCC Recruitment:  ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ (ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలు 10, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు 55, ప్రాజెక్ట్ మేనేజర్‌ (సివిల్‌) ఉద్యోగ ఖాళీలు 1, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగ ఖాళీ 1, ఆఫీస్‌ […]

Written By: Kusuma Aggunna, Updated On : December 2, 2021 11:06 am
Follow us on

NBCC Recruitment:  ఎన్‌బీసీసీ లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 70 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగ ఖాళీలలో డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ (ఎలక్ట్రికల్‌) ఉద్యోగ ఖాళీలు 10, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలు 55, ప్రాజెక్ట్ మేనేజర్‌ (సివిల్‌) ఉద్యోగ ఖాళీలు 1, సీనియర్‌ స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగ ఖాళీ 1, ఆఫీస్‌ అసిస్టెంట్‌ (స్టెనోగ్రాఫర్‌) ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి.

NBCC Recruitment

సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. 25 సంవత్సరాల నుంచి 47 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్యూటీ ప్రాజెక్ట్‌ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 వరకు వేతనం లభిస్తుంది.

మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు వేతనం లభిస్తుంది. ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వేతనం లభిస్తుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా 2022 సంవత్సరం జనవరి నెల ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

Also Read: NTRUHS Recruitment: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జాబ్స్.. మంచి వేతనంతో?

నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. https://www.nbccindia.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Also Read: Jobs: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?