ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) నిరుద్యోగులకు తీపికబురు అందించింది. భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి సంబంధించిన ఈ సంస్థ ఈఎంఎస్‌డీ, ఇతర విభాగాలలో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. మొత్తం 300 టెక్నికల్ ఆఫీసర్ల ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
2021 సంవత్సరం నవంబర్ 30వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 25,000 రూపాయల వేతనం లభిస్తుంది. కనీసం 60 శాతం మార్కులతో ఈఈఈ, ఈసీఈ, సీ.ఎస్.ఈ, ఐటీ విభాగాలలో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు.
Also Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగ ఖాళీలు.. రాతపరీక్ష లేకుండానే?
2021 సంవత్సరం డిసెంబర్ 21వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.ecil.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్ లో సాధించిన మార్కులు, అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లు న్యూఢిల్లీలోని జోనల్ కార్యాలయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కొరకు హాజరు కావాల్సి ఉంటుంది. https://www.ecil.co.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: ఎస్బీఐలో పర్సనల్ లోన్ కావాలా.. ఆన్ లైన్ లో సులభంగా లోన్ పొందే ఛాన్స్!