Teaching Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

Teaching Jobs: సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయాల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా శుభవార్త వెలువడింది. యోగా కోచ్‌, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్ ఉద్యోగ ఖాళీలతో పాటు స్పోర్ట్స్ కోచ్‌లు, డాక్ట‌ర్‌, స్టాఫ్ న‌ర్స్‌, కంప్యూట‌ర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, ప్రైమ‌రీ టీచ‌ర్లు, పీజీటీ, టీజీటీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది. బొల్లారం, హకీంపేటలో ఉన్న కేంద్రీయ విద్యాలయాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 13, 2022 2:24 pm
Follow us on

Teaching Jobs: సికింద్రాబాద్ కేంద్రీయ విద్యాలయాల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా శుభవార్త వెలువడింది. యోగా కోచ్‌, స్పెష‌ల్ ఎడ్యుకేట‌ర్ ఉద్యోగ ఖాళీలతో పాటు స్పోర్ట్స్ కోచ్‌లు, డాక్ట‌ర్‌, స్టాఫ్ న‌ర్స్‌, కంప్యూట‌ర్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్లు, ప్రైమ‌రీ టీచ‌ర్లు, పీజీటీ, టీజీటీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం అందుతోంది.

బొల్లారం, హకీంపేటలో ఉన్న కేంద్రీయ విద్యాలయాలలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం. జియోగ్రఫీ, ఎక‌నామిక్స్‌, కామ‌ర్స్, సైన్స్, సోష‌ల్ సైన్స్ విభాగాలతో పాటు హిందీ, ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, హిస్ట‌రీ విభాగాలలో కూడా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఎంబీబీస్, బీఏ/బీఎస్సీ, న‌ర్సింగ్ డిప్లొమా, న‌ర్సింగ్‌(బీఎస్సీ), ఏదైనా గ్రాడ్యుయేషన్ చదివిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారు.

ఎంసీఐలో రిజిస్టర్ అయిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని సమాచారం అందుతుండటం గమనార్హం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఈ నెల 15, 16 తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతాయి. కేవీ బొల్లారం, అల్లెన్బీ లైన్స్‌, సికింద్రాబాద్ అడ్రస్ లో ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 21,250 రూపాయల నుంచి 27,500 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.

https://bolarum.kvs.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ విధానం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల ఎంపిక ప్రక్రియ జరగనుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు భారీస్థాయిలో మేలు జరుగుతోంది.