https://oktelugu.com/

Red Sandel : శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం చెట్లు మరెక్కడా పెరగవు..ఎందుకంటే..?

Red Sandel : అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ సినిమా చూసిన తరువాత ఎర్ర చందనం గురించి స్టడీ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏపుగా పెరిగే చెట్లు.. పైన చూస్తే నల్లని బెరడు.. కానీ లోపల మొత్తం ఎర్రటి కలప.. చూడడానికే ఆశ్చర్యం కలిగించే ఎర్ర చందనం చెట్లు .. భారతదేశంలో పలుచోట్ల పెరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలో పెరిగేవి నెంబర్ వన్ గ్రేడ్ గా పిలుస్తారు. ఇక్కడి అడవుల్లో ప్రకృతి […]

Written By:
  • NARESH
  • , Updated On : January 9, 2022 / 09:23 AM IST
    Follow us on

    Red Sandel : అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప’ సినిమా చూసిన తరువాత ఎర్ర చందనం గురించి స్టడీ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. ఏపుగా పెరిగే చెట్లు.. పైన చూస్తే నల్లని బెరడు.. కానీ లోపల మొత్తం ఎర్రటి కలప.. చూడడానికే ఆశ్చర్యం కలిగించే ఎర్ర చందనం చెట్లు .. భారతదేశంలో పలుచోట్ల పెరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలో పెరిగేవి నెంబర్ వన్ గ్రేడ్ గా పిలుస్తారు. ఇక్కడి అడవుల్లో ప్రకృతి ఇచ్చిన ఈ ఎర్రచందనాన్ని కొందరు స్మగ్లర్లు అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ రవాణా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. ఎందుకంటే ఎర్రచందనంకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఏ వన్ గ్రేడ్ ఎర్రచందనం టన్నుకు రూ.50 లక్షలు పలుకుతుందని ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. అసలీ ఎర్రచందనం కథా కమీషను ఏంటో తెలుసుకుందాం..?

    red sandal

    ఎర్రచందనంకు ‘టెరో కార్పస్ సాంటలైనస్’ అనే శాస్త్రీయనామం ఉంది. టెరో అంటే గ్రీకూ భాషలో కర్ర అని అర్థం. దీనినే రక్త చందనం, శాంటాలం, ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. బంగారం కంటే విలువైనది కనుగ దీనిని ఎర్ర బంగారం అని అంటారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం చెట్లు ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో విస్తరించాయి. ఇక్కడ దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో  కొండలు విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎర్రచందనం లభ్యమవుతుంది. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవుల్లో ఇవి లభ్యమవుతాయి. ముఖ్యంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం మంచి క్వాలిటీదని చెబుతుంటారు.

    శేషాచలం కొండలు చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఈనేల స్వభావం వల్ల దీనికి నాణ్యత వచ్చింది. ఇక్కడున్న మట్టి చెట్ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ కొండల్లో ఐరన్, గ్రాఫైట్, కాల్షియం లాంటి ఖనిజ సంపద కూడా ఉన్నట్లు ఫ్రొపెసర్లు చెబుతున్నారు. ఎర్ర చందనంను కొందరు రైతులు కూడా పెంచుతున్నారు. కానీ వాళ్ల పంటలకు ఇంత క్వాలిటీ రావడం లేదు. అంతేకాకుండా వాళ్లు చెట్లు పెంచాలంటే అటవీ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. చైనా జపాన్ వాళ్లు కూడా ఇక్కడి మొక్కలను తీసుకెళ్లి పెంచడానికి ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఇక్కడున్న భూమి స్వభావాన్ని భట్టే ఎర్రచందనం క్వాలిటీగా ఉంటుంది. ఇక కొండల్లో పెరిగే చెట్లు 20 సంవత్సరాలకే కలప తయారవుతుంది. కానీ రైతులు పెంచితే 30 సంవత్సాలు పడుతుంది.

    చైనా, జపాన్ దేశాల్లో ఎర్రచందనంతో పాత్రలు, గిన్నెలు, సంగీత వాయిద్యాలు తయారు చేస్తారు. అలాగే మంచి బొమ్మలు తయారు చేసి బహుమతిగా ఇస్తారు. అంతేకాకుండా ఇందులో ఔషధ గుణాలు ఉండడంతో రష్యా దేశం కూడా కొంటోంది. వయగ్రా, కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్స్ లాంటి వాటిలో దీనిని వాడుతారు.రక్తాన్ని శుద్ధి చేయడంలో ఎర్రచందనం ఉపయోగపడుతుంది. ఈ డిమాండ్ నేపథ్యంలో కొందరు స్మగ్లర్లు ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని ఉడ్ కట్టర్, ఫైలన్, ట్రాన్స్ పోర్టు, గోడౌన్ ..ఇలా దశల వారీగా చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

    అయితే 2015లో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ నిత్యం కూంబింగ్ చేస్తూ ఎర్ర చందనం ను నరకకుండా అడ్డుకుంటున్నారు. 2021 సంవత్సరంలో 104 కేసుల్లో 434 మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇక అంతర్జాతీయంగా వీటికి డిమాండ్ ఉన్నందునే స్మగ్లింగ్ ఆగడం లేదంటున్నారు. ఏ వన్ గ్రేడ్ ఎర్రచందనం ఒక టన్నుకు రూ.50 లక్షలు ఉంటుందని అంటున్నారు.