https://oktelugu.com/

Mohan Babu: ఇండస్ట్రీ పెద్ద కోసం మోహన్ బాబు పాకులాటే కొంపముంచిందా?

Mohan Babu: టాలీవుడ్ లో ఇప్పుడు ‘పెద్దరికం’ కోసం పోరు నడుస్తోంది. సినీ ప్రముఖులంతా చిరంజీవిని సినీ పెద్దగా చూస్తుంటే.. మంచు మోహన్ బాబు మాత్రం తనకు తానే పెద్దరికాన్ని అన్వయించుకుంటున్నారు. అయితే ఆయనకు సపోర్టుగా కంటే.. వ్యతిరేకంగానే నిలిచే వారు ఎక్కువయ్యారు. ఈ ఇగోల మంటల్లో టాలీవుడ్ పరువు బజారు పాలవుతోంది. తాజాగా మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దానికి నొచ్చుకున్న మోహన్ బాబు ట్రోలర్స్ పై కేసులు […]

Written By:
  • NARESH
  • , Updated On : February 20, 2022 / 01:46 PM IST
    Follow us on

    Mohan Babu: టాలీవుడ్ లో ఇప్పుడు ‘పెద్దరికం’ కోసం పోరు నడుస్తోంది. సినీ ప్రముఖులంతా చిరంజీవిని సినీ పెద్దగా చూస్తుంటే.. మంచు మోహన్ బాబు మాత్రం తనకు తానే పెద్దరికాన్ని అన్వయించుకుంటున్నారు. అయితే ఆయనకు సపోర్టుగా కంటే.. వ్యతిరేకంగానే నిలిచే వారు ఎక్కువయ్యారు. ఈ ఇగోల మంటల్లో టాలీవుడ్ పరువు బజారు పాలవుతోంది. తాజాగా మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. దానికి నొచ్చుకున్న మోహన్ బాబు ట్రోలర్స్ పై కేసులు పెట్టడానికి రెడీ అయ్యారు. అయితే మోహన్ బాబు పెద్దరకం కోసం వెంపర్లాట ఇప్పుడు చేటు తెచ్చిందన్న విమర్శలు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి.

    Mohan Babu

    మోహన్ బాబు మంచి నటుడు. చక్కటి డైలాగ్ డెలివరీ ఆయన సొంతం.. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అయన తప్ప వేరే వారు చెయ్యలేరు అనే మ్యానరిజం ఉన్న ఒక గొప్ప నటుడు. అయితే అయన సన్ అఫ్ ఇండియా సినిమా మంచి టాక్ తెచ్చుకోలేదు అని తెలుస్తున్నది. ఇది ఆయన నోటి దురుసుతనం. వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్న అతి కారణమని… వెరసి ఇది వారి స్వయంకృతాపరాధం అని సోషల్ మీడియా నేడు కోడై కూస్తున్నది.

    సినిమా ఫెయిల్ అవ్వడం సహజం. తప్పు కాదు. అది ట్రోల్ చెయ్యాల్సినంత బూతు కాదు. ప్రతీ హీరో, నిర్మాత జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి. బాధ పడకుండా మరొక హిట్ కోసం ప్రయతించాలి. అయితే ఆ తపన కసి మోహన్ బాబు ఫ్యామిలీ ఉన్నట్లు నేడు కనపడడం లేదు. తప్పులు ఎక్కడ దొర్లుతున్నాయి అనే వాస్తవాన్ని అయన తెలిసికొన్నట్లు అనిపించడం లేదు.

    ఒకప్పుడు కసితో, పట్టుదలతో, తనలో ఉన్న టాలెంటుకి పదును పెట్టాడు. విలక్షణ నటుడయ్యాడు. కలెక్షన్ కింగ్ అయ్యాడు. కానీ నేడు పెద్దరికం అనే బోర్డు కోసం వెంపర్లాడుతూ టాలెంటుని మరుగున పెడుతున్నాడు. దురుసు మాటలతో జనాల్లో పలుచనై పోతున్నాడు. సన్ అఫ్ ఇండియాకి వచ్చిన ఆదరణే దీనికి సజీవ సాక్ష్యం అని మన కలెక్షన్ కింగ్ తెలుసుకోగలగాలి. మన చిరకాల ప్రత్యర్థులను తిట్టినంత మాత్రాన మన సినిమాలు హిట్ కాలేవు. మన చిరకాల ప్రత్యర్థులను గట్టిగా తిడితే కొన్న్ని పార్టీలకు మనం దగ్గర కావచ్చు. తద్వారా మనకి కొన్ని పెద్ద పదవులు దక్కవచ్చు. కానీ మన సినిమాలకు జనాలు మాత్రం రాలేరు. జనాలు రావాలంటే టాలెంటుతో పాటు, ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. సహనమే విజయానికి సోపానం. అంతే గాని పెద్దరికం అనే బోర్డులు మెడలో పెట్టుకొని తిరిగితే విజయం సాధించలేము అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

    ఒక సినిమా ఫెయిల్ అయితే ఆ నిర్మాత కుటుంబం ఎంత కష్టాలు పాలవుతుందో చాలా దగ్గరగా చుశాం. సినిమా హిట్ అయితే మరొక సినిమా వస్తుంది. దానితో వేల కుటుంబాలకి ఉపాధి దొరుకుతుంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలి. అప్పుడే సినిమా రంగం బతికి బట్టకడుతుంది. కానీ సినిమా తీస్తున్నాను కదా అని కన్ను మిన్ను కాకుండా రెచ్చిపోకూడదు అని మంచు ఫామిలీ కూడా తెలిసికోవాలని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక కళాకారుడికి అహం ఉంటే ఆ కళాకారుడు నిలదొక్కుకోలేడు. ప్రేక్షకుల ఆదరణ కూడా పొందలేడు. రాజకీయాలు వేరు సినిమా వేరు అని మంచు ఫామిలీ నేటికైనా తెలిసికోవాలని నెటిజన్లు, విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. వాళ్ల నుంచి మరిన్ని సినిమాలు రావాలి. అవి మంచి పేరు తెచ్చికోవాలి. అలా జరగాలి అంటే కళాకారుడు భూమికి ఒదిగి ఉన్నప్పుడే ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తారు అని మంచు ఫ్యామిలీ ఇప్పటికైనా తెలుసుకోవాలి.

    సినిమా పెద్దని అవ్వాలనే ఆశ మోహన్ బాబుకు ఉందని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. అందుకే ఆయన మీద ఇంత విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నది. ఇది మీరు తెలిసుకొని మసలుకోవాలి. కానీ అలా జరగడం లేదు. గురువు దాసరి కుటుంబానికే మీరు పెద్ద కాలేక పోయారన్న విమర్శ ఉంది. వారి ఆస్తుల గొడవలను మోహన్ బాబు తీర్చలేకపోయారు. ఒక కుటుంబానికే పెద్ద కాలేకపోతే మొత్తం సినిమా పరిశ్రమకి ఎలా పెద్దలు కాగలుగుతారు అని సోషల్ మీడియా గొగ్గోలు పెడుతున్నది. అయినా నేను పెద్దని. నేను పెద్దని అని చెప్పుకొంటే పెద్దరికం రాదు. అధికారం కొనుకొంటే వస్తుదేమో గాని పెద్దరికం అలా రాదు. మన ప్రయత్నాలు మనం చేసుకొంటూ అందరితో మంచిగా ఉంటూ ముందుకు సాగాలి. అప్పుడే సినిమా పరిశ్రమే మన దగ్గరకు రావచ్చు. కానీ అందుకు ముందు మనం కఠోర పరిశ్రమ చేయాలి. టాలెంటుని నమ్ముకోవాలి. కానీ అహంకారాన్ని కాదు అని మంచు ఫ్యామిలీతో పాటు అందరూ గమనించాలి.

    Also Read: Chiranjeevi-Mohan Babu: ఒకే వేదిక‌పైకి చిరంజీవి, మోహ‌న్ బాబు.. వివాదాల‌కు చెక్ పెడతారా..!

    -చివరగా ఒక్క మాట
    మనల్ని వాడుకొనే అంకుల్స్, బావలు ఎంతోమంది ఉండవచ్చు. వాళ్ళ పదవులు ఎన్ని పదవులు అయినా కట్టబెట్టగలరు.. లేదా ఉపశమనానికి కొబ్బరి బొండాలు అయినా పంపగలరు? కానీ మన సినిమాకి జనాన్ని మాత్రం పంపలేరు అని ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి. పెద్దరికంతో సినిమాలు హిట్ కాలేవు. మన సినిమాకి జనం కావాలి అంటే మనలో టాలెంటు అయినా ఉండాలి. లేక మన సినిమాలో కంటెంట్ అయినా ఉండాలి. లేదా ప్రేక్షక దేవుళ్ళకి ఒదిగి అయినా ఉండాలి అనేది ప్రతీ కళాకారుడు ఎంత తొందరగా తెలుసుకొంటే అంత మంచిదేమో? ప్రేక్షక దేవుళ్ళు దయ ఉంటేనే మన సినిమా ఆడుతుంది అనే సత్యాన్ని మరిచి కన్ను మిన్ను కాకుండా మాట్లాడితే ఇలానే ఉంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.. మంచు ఫామిలీకే కాదు ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుంది అని గమనించాలి. ఆలోచించండి

    Also Read: Mohan Babu Son Of India Collections: ప్చ్.. 47 ఏళ్ల సినీ కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ ప్లాప్

    Recommended Video: