Suriya ‘Jai Bheem’: సినిమాలు అందరూ తీస్తారు.. కానీ కదిలించే సినిమాలు కొందరే తీస్తారు. తమిళ స్టార్ హీరో సూర్య తీసిన సినిమా ‘జైభీమ్’ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది. ప్రశంసలు కురిపిస్తోంది. సమాజంలో జరిగిన అన్యాయాన్ని ఆక్రందనను కళ్లకు కట్టిన ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సూర్య హీరోగా వచ్చిన ‘జైభీమ్’ సినిమా విజయవంతంగా సాగుతోంది. ఈ సినిమాను చూసిన రాజకీయ, సినీ, అధికార ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన కథను ఎంచుకున్న హీరో సూర్యను అభినందిస్తున్నారు. ఇలాంటి కథను ప్రజలకు చూపించడానికి ధైర్యం ఉండాలని కొనియాడుతున్నారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలయిన ఈ సినిమాను చాలా మంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓటీటీ వేదికగా మంచి సినిమా వచ్చిందని తమిళ, తెలుగు ప్రేక్షకులు మురిసిపోతున్నారు. యథార్ధ ఘటన ఆధారంగా తీసిన ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అని కొంత మందికే తెలుసు. కర్ణాటకలో జరిగిన ఈ సంఘటనను అచ్చం అవే పేర్లతో సినిమా తీశారు. పాత్రల్లో నటులు ఉన్నారు కావచ్చు.. కానీ ఆ పాత్రలు మాత్రం కొన్ని సజీవంగా ఉన్నాయి. మరి ‘జైభీమ్’ రియల్ స్టోరీ ఏంటి..? ఏ కథ ఆధారంగా తీశారు..? పూర్తి వివరాలు మీకోసం..
ఓ గిరిజనుడు అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుపోతాడు. సినిమాలో ఆ పాత్ర పేరు రసకణ్ణు. కర్ణాటకలో జరిగిన యథార్థ గాథ ఇదీ. ఈ రియల్ లైఫ్ స్టోరీ విషయానికొస్తే.. 1993లో కర్ణాటక రాష్ట్రంలోని కడలూరు జిల్లా కమ్మాపురం పోలీస్ స్టేషన్ పరధిలోని గ్రామంలో రసకణ్ణు జన్మించాడు. అతడి భార్య పేరు భార్వతి. రసకణ్ణు పోలీస్ స్టేషన్ వెళ్లాక పార్వతి ఓ సీపీఎం నాయకుడిని కలుస్తుంది. ఆయన వెంటనే పార్టీ యూనియన్ సెక్రటరీ రాజమోహన్ దృష్టికి తీసుకెళ్లాడు. ఈ కేసు గురించి తెలిసిన గోవిందన్ అనే నాయకుడు సైతం రాజమోహన్ తో కలిసి పోరాటం చేశారు. అప్పట్లో కడలూరు జిల్లా సెక్రటరీ, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శి అయిన బాలకృష్ణన్ ఆధ్వర్యంలో రసకణ్ణు కోసం పోరాటం నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణన్ రసకణ్ణు ఈ కేసు గురించి అప్పటి విషయాలను చెప్పాడు. ‘1993 మార్చి 20వ తేదీన గోపాలపురంలో కథిరవేలు ఇంట్లో 40 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ తరువాత కమ్మాపురం పోలీసులు వచ్చారు. అయితే కథిరవేలు కుటుంబ సభ్యులు తమ ఇంట్లో పనిచేసే రసకణ్ణు మీద అనుమానం ఉందని పోలీసులకు చెప్పారు. దీంతో అదే రోజు పోలీసులు రసకణ్ణు ఇంటికి వెళ్లి ఆయన గురించి చెప్పాలని ఆయన భార్య పార్వతిని హింసించారు. పోలీసులు మొదట రసకణ్ణు భార్య పార్వతిని, ఆ తరువాత ఆమె అన్న రత్నంను అరెస్టు చేశారు. ఆ తరువాత ఊళ్లో వాళ్లు రసకణ్ణును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించడంతో పార్వతిని విడిచిపెట్టారు’ అని చెప్పారు.
సీపీఎం నాయకుడు రాజమోహన్ మాట్లాడుతూ ‘ఆ మరుసటి రోజు పార్వతి పోలీస్ స్టేషన్ కు తన భర్త కోసం వెళ్లగా రసకణ్ణును అప్పటికే చితకబాదారు. అతడు కనీసం అన్నం కూడా తినలేని స్థితిలో ఉండడాన్ని చూసి పార్వతి తట్టుకోలేకపోయింది. దీంతో ఆమె ఊళ్లోని వామపక్ష నేత గోవిందన్ కు ఈ విషయాన్ని చెప్పింది. ఆ సమయంలో ఫోన్ సౌకర్యం లేకపోవడంతో గోవిందన్ అదే రాత్రి నా వద్దకు వచ్చారు’ అని చెప్పారు.
ఆ సమయంలో లాయర్ గా ప్రాక్టీసు చేస్తున్న చంద్రు దగ్గరికి వెళ్లాం. అయన చెన్నైలో ఉంటున్నారు. ఆయన దీనిపై హెబియస్ కార్పస్ ఫిటిషన్ వేయొచ్చని చెప్పారు. ఫీజు గురించి అడిగినప్పుడు ఒక్క రూపాయ కూడా తీసుకోనని చెప్పారు. ఆ తరువాత కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించాం. అయితే ఈ కేసుకు సంబంధం ఉన్న పోలీసులు, వారి వకీలు కలిసి లాయర్ చంద్రును కలిశారు. తాము రాజీకి వచ్చామని చెప్పారు. ఈ విషయం మాకు తెలియగానే మేం చంద్రునికి కలిసి అదంతా అబద్ధమని చెప్పాం. ఆ తరువాత పోలీస్ స్టేషన్లో కొట్టడం వల్లే రసకణ్ణు చనిపోయాడని, అతడి బాడీని ఎస్ఐ సహా పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఒక వాహనంలో తీసుకెళుతుండగా వెంకుశా అనే వ్యక్తి గుర్తించారు. గుర్తు తెలియని మృతదేహంగా భావిస్తున్న ఓ ఫొటో ను చూసి పార్వతి ఈ దేహం తన భర్తదేనని చెప్పింది.
2006లో రసకణ్ణు హత్యకు కారణమైన పోలీసుల అధికారులను హైకోర్టు దోషులుగా నిర్దారించింది. ఈ కేసులో ఎస్ఐ అంటోని సామి సహా ముగ్గురికి జీవిత ఖైదు విధించారు. ఎస్ఐ సుబ్రమణి సహా ఇద్దరికి ఐదేళ్లు, తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిన డాక్టర్ కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విషాదాంతమై న్యాయం జరిగిన కథను అంతే గొప్పగా చిత్రీకరించారు. హీరో సూర్య లాయర్ పాత్రలో ఇరగదీశారు. ఇప్పుడీ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి.