Telangana Congress: గీత దాటితే వేటే… రేవంత్‌ కాంగ్రెస్ ను గాడిలో పెడుతున్నాడా?

Telangana Congress: పార్టీ శ్రేణులకు వార్నింగ్‌ ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. సీనియర్లపై కొందరు కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించి సీరియస్‌ అయ్యారు. అందరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని, గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. పార్టీ సభ్యత్వ నమోదులో సత్తా చాటి.. అధిష్టానం దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన పార్టీ అగ్ర […]

Written By: NARESH, Updated On : April 18, 2022 3:45 pm
Follow us on

Telangana Congress: పార్టీ శ్రేణులకు వార్నింగ్‌ ఇచ్చారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. సీనియర్లపై కొందరు కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించి సీరియస్‌ అయ్యారు. అందరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని, గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.

Revanth Reddy

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా కాంగ్రెస్‌ ఫోకస్‌ పెట్టింది. పార్టీ సభ్యత్వ నమోదులో సత్తా చాటి.. అధిష్టానం దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టిన పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ.. వచ్చే నెలలో రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. అటు ఢిల్లీలో, ఇటు హైదరాబాద్‌లో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ.. ఐక్యంగా ముందుకు సాగాలని భావిస్తున్నారు టీకాంగ్రెస్‌ సీనియర్లు. అయితే ఈ క్రమంలోనే పార్టీ సీనియర్లపై కొందరు కార్యకర్తలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తాజాగా సీరియస్‌ అయ్యారు. అందరూ పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలని, గీత దాటితే వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ట్విట్టర్‌ వేదికగా తాజాగా చేసిన ఆయన చేసిన కామెంట్స్‌ పరిస్థితి తీవ్రతను తెలుపుతున్నాయి.
కాంగ్రెస్‌కు ఐకమత్యమే మహాబలమంటూ..

‘కాంగ్రెస్‌కు ఐకమత్యమే మహాబలం. అందుకు భిన్నంగా ఎవరైనా ప్రవర్తించినా, పార్టీ ముఖ్యులపైన, వివిధ హోదాల్లో ఉన్న నాయకులపైన, బహిరంగంగా లేదా సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తే పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణతోపాటు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొక తప్పదు’ అంటూ పార్టీ శ్రేణులను హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్‌ చేశారు. అయితే రేవంత్‌ ట్వీట్‌పై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్గత స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్చ ఎక్కువగా ఉన్న కాంగ్రెస్‌లో ఈ హెచ్చరికలు పెద్దగా ప్రభావం చూపవని కొందరు అంటుండగా.. మరికొందరు రాహుల్‌ ఇచ్చిన బలంతోనే రేవంత్‌ ఇలా స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Also Read: TRS vs Governar: ఓవర్‌ టూ ఢిల్లీ : మళ్లీ హస్తిన పర్యటనకు గవర్నర్‌ తమిళిసై.. మోదీ, షాతో భేటీ?

-రేవంత్‌కు ఫ్రీ హ్యాండ్‌..

తెలంగాణలో పార్టీని చక్కదిద్వే విషయంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పీసీసీ చీఫ్‌కు ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చినట్లు పార్టీటలో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర నేతలతో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఐక్యంగా పనిచేయడం, వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేయడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన అధిష్టానం పార్టీలో అంతర్గత స్వేచ్ఛ, మీడియా ముందు, సోషల్‌ మీడియాలో సొంత పార్టీ నేతలపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించినట్లు తెలిసింది. దీనిపై గతంలో జెగ్గారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొంతమంది సీనియర్‌ నేతల వ్యవహారంపై రేవంత్‌రెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినటట్లు తెలిసింది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం.. సీనియర్లను కట్టడి చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని, పీసీసీ చీఫ్‌కు కొన్ని అధికారాలలు ఇవ్వలని రేవంత్‌ సూచించారు. దీనిపై సమాలోచనలు చేసిన అధిష్టానం.. రేవంత్‌కు పార్టీ నేతల కంట్రోల్‌ విషయంలో స్వేచ్ఛ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బహిరంగ వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై అదుపులో ఉండాలని హెచ్చరిక జారీ చేసినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Also Read: Madhya Pradesh CM: ఎన్టీఆర్, ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం.. తెగ మురిసిపోతున్న ఫ్యాన్స్

Tags