Caste Politics In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో అధికారం కేవలం కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే ఉండడాన్ని మిగతా వర్గాలు జీర్ణించుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో ప్రబలంగా ఉన్న కాపు సామాజికవర్గం ఇప్పుడు అధికారమే పరమావధిగా కదులుతోంది..ఏపీలో బీజేపీ, జనసేన చీఫ్ లు ఇద్దరూ కాపు సామాజికవర్గమే.. ఇక తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు.. ఇలా రెండు చోట్ల వచ్చేసారికి ఈ అగ్రవర్ణాలను ఓడించాలన్న కసి పట్టుదల మెజార్టీ వర్గాల్లో ఉంది.
ఏపీ, తెలంగాణలో రెడ్లు, కమ్మలు, వెలమల కంటే కూడా బీసీలు, కాపుల జనాభా ఎక్కువ. కానీ ఎప్పుడూ వీరు రెడ్డి, కమ్మలు, వెలమల చేతుల్లో పల్లకీ మోసే రెండో తరగతి వ్యక్తులుగానే మిగిలిపోతున్నారు. ఆ ఆవేదన, ఆగ్రహం వారిలో కలగలిసి ఉన్నాయి. కాపుల కోసం చిరంజీవి బయలు దేరినప్పుడు ఆయన వెంట చాలా మంది వచ్చారు. కానీ కుట్రలు , కుతంత్రాలతో చిరంజీవిని ఎటూ కాకుండా చేశారు. చివరకు పార్టీ ఎత్తేసే పరిస్థితికి తెచ్చారు.
ఇప్పుడు ఏపీలో కాపుల కోసం బీజేపీ, జనసేన అడ్డంగా నిలబడుతున్నాయి. పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు పొత్తు పెట్టుకొని వెళుతున్నారు. వచ్చేసారి పవన్ కళ్యాణ్ ను సీఎం క్యాండిడేట్ గా ప్రకటించి బీజేపీ ముందుకెళ్లాలని చూస్తోంది. ఇందుకోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. జగన్ వైసీపీకి మెజార్టీ రాకుంటే చంద్రబాబును కలుపుకొని అయిన జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: Heroine Bold Comments: నేను సింగిల్ కాదు, మింగిల్.. క్రేజీ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ !
ఇక తెలంగాణలో కాంగ్రెస్ తరుఫున రెడ్డి సామాజికవర్గం బలంగా ఉండేది. కొన్ని దఫాలు వారి చేతుల్లోనే తెలంగాణలో అధికారం వర్ధిల్లింది.కానీ తెలంగాణ విడిపోయాక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను.. దాన్ని లీడ్ చేస్తున్న రెడ్డి సామాజికవర్గాన్ని ఇక్కడి ప్రజలు ఆదరించలేదు. అక్కున చేర్చుకోలేదు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్నారు. అందుకే ఈసారి ఎలాగైనా తెలంగాణలో గెలవాలని బలమైన రెడ్డి అయిన రేవంత్ ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. ఆయన ఇప్పటికే రెడ్డీలను ఏకం చేసే క్రమంలో ‘రెడ్డీ’లకు పగ్గాలు ఇస్తేనే అధికారం అని హాట్ స్టేట్ మెంట్ చేశాడు. వైఎస్ఆర్ లాగానే రెడ్డిలను ఏకం చేసి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతున్నారు.
రేవంత్ రెడ్డి ప్రకటనతో కాంగ్రెస్ లోని బీసీలంతా భగ్గుమన్నారు. వారిలోనే అసంతృప్తి మొదలైంది. అయితే బీసీల్లో సరైన నాయకుడు లేకపోవడం మైనస్ గా మారింది. బండి సంజయ్ ఆ లోటును ఎంత వరకూ భర్తీ చేస్తాడు? తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాడా? అన్నది వేచిచూడాలి.
ఇప్పటికే చాలా మంది బీసీలకు కాంగ్రెస్ పగ్గాలు ఇచ్చినా అధికారంలోకి తేలేకపోయారు. అందుకే ఇప్పుడు తెలంగాణలో వెలమ, రెడ్లను మించి నాయకత్వాన్ని పటిష్టంగా నిర్వహించే నేతలు పుట్టుకురావాల్సి ఉంది. బండి సంజయ్ ఆ లోటును భర్తీ చేస్తాడో చూడాలి. ఏపీలో మాత్రం పవన్, సోము వీర్రాజు లాంటి వారి వల్ల అక్కడి కాపు , బీసీల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Also Read: Nara Lokesh Padayatra: పాదయాత్రకు చిన్నబాబు సన్నాహాలు.. చంద్రబాబు భారీ యాక్షన్ ప్లాన్