https://oktelugu.com/

Venu Prasad: పంజాబ్ కొత్త ఆప్ ప్రభుత్వాన్ని నడిపించనున్న తెలుగుబిడ్డ.. ఐఏఎస్ వేణుప్రసాద్ కు కీలక పోస్ట్

ఆమ్ ఆద్మీ.. ఇది సామాన్యుల పార్టీ. సామాన్యులే నడిపిస్తున్న పార్టీ.. సామాన్యుల కోసమే పనిచేస్తున్న పార్టీ. డబ్బు, మద్యం పారించకుండా నీతిమంతమైన పాలన అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీని స్తాపించిన కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీలో చేసి చూపించారు. ఇప్పుడు ఆ ఘనతను చాటి చెప్పి పక్కనున్న పంజాబీల మనసు దోచి అక్కడ విజయబావుటా ఎగురవేశారు. పంజాబ్ అంటేనే డ్రగ్స్.. యువత మొత్తం డ్రగ్స్ మత్తులో జోగి అరాచకాలకు, అత్యాచారాలకు నెలవుగా ఉండేది. అలాంటి చోట 100 […]

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2022 / 06:43 PM IST
    Follow us on

    ఆమ్ ఆద్మీ.. ఇది సామాన్యుల పార్టీ. సామాన్యులే నడిపిస్తున్న పార్టీ.. సామాన్యుల కోసమే పనిచేస్తున్న పార్టీ. డబ్బు, మద్యం పారించకుండా నీతిమంతమైన పాలన అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీని స్తాపించిన కేజ్రీవాల్ దేశ రాజధాని ఢిల్లీలో చేసి చూపించారు. ఇప్పుడు ఆ ఘనతను చాటి చెప్పి పక్కనున్న పంజాబీల మనసు దోచి అక్కడ విజయబావుటా ఎగురవేశారు.

    పంజాబ్ అంటేనే డ్రగ్స్.. యువత మొత్తం డ్రగ్స్ మత్తులో జోగి అరాచకాలకు, అత్యాచారాలకు నెలవుగా ఉండేది. అలాంటి చోట 100 ఏళ్ల కాంగ్రెస్ ను ఓడించి సుపరిపాలన అందించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నడుం బిగించింది. ఆ పార్టీని కేజ్రీవాల్ చొరవతో ముందుండి నడిపించిన భగవంత్ సింగ్ మాన్ ఇప్పుడు సీఎంగా గద్దెనెక్కబోతున్నాడు. ఇలా ఫలితాలు వచ్చాయో లేదో అప్పుడే భగవంత్ సింగ్ పని మొదలుపెట్టాడు. నీతి, నిజాయితీ గల అధికారులను ఏరి పెట్టుకుంటున్నాడు. పంజాబ్ రాష్ట్ర పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ రూపు రేఖలు మార్చి విద్యుత్ ను నిరంతరం అందించిన తెలుగు, బిడ్డ, స్టిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అరిబండి వేణు ప్రసాద్ కు ఇప్పుడు అందలం దక్కింది. పంజాబ్ కొత్త సీఎం భగవంత్ సింగ్ మాన్ ఏరికోరి ఈ తెలుగు ఐఏఎస్ ను తన కోటరీలో నియమించుకున్నాడు.

    పంజాబ్ లో కొత్తగా ఏర్పడబోయే ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇలా గద్దెనెక్కకముందే అమలు చేయాల్సిన పరిపాలనా మార్పులకు దారితీసింది. చాలా కాలం పాటు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీగా కొనసాగిన తెలుగు ఐఏఎస్ ను కీలకమైన పంజాబ్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా అపాయింట్ చేసింది. ప్రస్తుతం వేణుప్రసాద్, ఏసీఎస్, ఎక్సైజ్, టాక్సేషన్‌ కమిషనర్ గా పనిచేస్తున్నారు.

    తెలుగు ఐఏఎస్ అరిబంటి వేణుప్రసాద్ స్టిక్ట్ ఆఫీసర్, నీతి నిజాయితీలతో పనిచేస్తాడని.. ఆయా శాఖల్లో, కలెక్టర్ గా ఆయన ముక్కుసూటితనం.. ప్రభుత్వ పనులను నిక్కచ్చిగా చేశాడని పేరుంది. సమర్థుడైన అధికారిగా మన్ననలు అందుకున్నారు. ఈయనది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. పంజాబ్ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ప్రధానకార్యదర్శి హోదాకు ఎదిగి పంజాబ్ కు వెలుగయ్యారు. పట్టుదల కార్యదక్షతతో నిలువెత్తు సాక్ష్యంగా కనిపిస్తోన్న వారి జీవనగమనం ఇది ఎందరికో స్ఫూర్తిదాయం.

    -అరిబంటి వేణుప్రసాద్ ప్రస్థానం
    శ్రీరంగయ్య-శ్రీమతి మంగమ్మలకు రెండో సంతానంగా 1964లో పుట్టిన వేణుప్రసాద్ ప్రాథమిక విద్యను మునుగాలలో, పదోతరగతి వరకూ ఖమ్మం పట్టణంలోని రికాబ్ బజార్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. విలువలతో కూడిన వ్యక్తి వారి తండ్రి పెంపకంలో.. సామాజిక సృహ మెండుగా ఉన్న వ్యక్తి. ఇక రజకార్లను ఎదురించిన ‘పెంచికల్ దిన్నె’ వారసత్వం ఉండనే ఉంది. అందుకే కష్టపడి చదివి నాగార్జున సాగర్ గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్ సీటు సాధించారు. అనంతరం ‘మెడిసిన్’ చదవాలనుకొని వెంట్రుకవాసిలో సీటు చేజార్చుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బాపట్ల వ్యవసాయ కాలేజీలో 1980 సంవత్సరంలో చేరారు. డిగ్రీ , ఆ తర్వాత రాజేంద్రనగర్ వ్యవసాయ కాలేజీలో పీజీ చేశారు. బాపట్ల కాలేజీ చదివేటప్పుడే క్రీడల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి ఫుట్ బాల్ కెప్టెన్ అయ్యారు. పీజీ తర్వాత మొదట ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ జీవితం ప్రారంభించినా మనిషిలో ఏదో తపన, ఆరాటం ఉండేదిన. పీజీ చదివే రోజుల్లోనే హాస్టల్స్ లో సీనియర్లు బ్యాంకు, సివిల్స్,గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యేవారు. వీరందరి ప్రభావంతో బ్యాంక్ ఉద్యోగంలో వేణుప్రసాద్ చేరారు. కానీ తృప్తినివ్వలేదు.అనంతరం ఫారెస్ట్ సర్వీస్ రాసి విజయం సాధించారు. ఆ సర్వీస్ లో శిక్షణ పొందుతూనే సివిల్స్ రాశఆడు.. మూడు సార్లు రాసినా ఐఏఎస్ సాధించలేకపోయారు. అయితే ఆ సమయంలో మండల కమీషన్ గొడవల్ల ప్రభుత్వం సివిల్స్ రాసేవారికి నాలుగో అవకాశం ఇచ్చింది. అప్పటికే మూడు సార్లు రాసిన వేణు ప్రసాద్ ఈసారి అందివచ్చిన అవకాశాన్ని కూడదీసుకొని సివిల్స్ రాసి తన ఐఏఎస్ లక్ష్యాన్ని 1991లో సాధించాడు. పట్టుదలతో ముందు సాగి పంజాబ్ రాష్ట్రానికి ఐఏఎస్ గా కేటాయించబడ్డారు.

    -పంజాబ్ లో వేణుప్రసాద్ మార్క్ పాలన
    పంజాబ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్న వేణు కలెక్టర్ గా, ఐఏఎస్ అధికారిగా తన పనితీరు, లక్ష్యాల సాధనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆదర్శవంతంగా పనిచేస్తూ ఏ శాఖలో బాధ్యతలు నిర్వహిస్తే ఆ శాఖ ఉద్యోగులకు స్ఫూర్తి ప్రదాత అయ్యారు. జలంధర్, ఫరీద్ కోట్ జిల్లాల కలెక్టర్ గా విధులు నిర్వహించి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అనంతరం వివిధ శాఖల్లో కమిషనర్ గా తనదైన ముద్ర వేశారు. కీలకమైన విద్యుత్, నీటి వనరులు, గనులు శాఖలు పర్యవేక్షించి సమర్ధుడైన అధికారిగా అద్వితీయమైన విజయాలు సాధించారు.

    విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ చైర్మన్ గా 2019-20 సంవత్సరంలో 1158 కోట్ల నష్టాల్లో ఉన్న సంస్థను 2021 సవంత్సరానికి 1446 కోట్ల లాభాలతో తన పని తీరు చూపెట్టారు. 2021 డిసెంబర్ 20న అవిభక్త అనాథ కవలలకు విద్యుత్ శాఖలో ఉద్యోగాలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నారు. పంజాబ్ లో అద్వితీయమైన ఫలితాలను సాధిస్తూ మెరుగ్గా రాణించిన వేణుప్రసాద్ కు కొత్త ఆప్ ప్రభుత్వంలో అందలం దక్కింది. ఏకంగా సీఎం పర్సనల్ సెక్రటరీగా ప్రమోషన్ దక్కింది. ఇలా తెలుగు వ్యక్తి, ఖమ్మం వాసి పంజాబ్ పాలనలో ఇప్పుడు కీలక శక్తిగా మారనున్నారు. ఆయనకు మనం ఆల్ ది బెస్ట్ చెబుదాం.