https://oktelugu.com/

World In 2070: 2070వ సంవత్సరంలో ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది?

World In 2070: ప్రపంచం సాంకేతక రంగంలో దూసుకుపోతోంది. శ్రమను సులభతరం చేసుకునేందుకు మనిషి యాత్రాలపై ఆధారపడుతున్నాడు. ఇందలో భాగంగానే అయేక వస్తువులు, పరికరాలు పుట్టుకొచ్చాయి. మనవ జీవిత సులభతరమైంది. మానవుడు తన మెదడుకు పదును పెడుతూ పోతే భవిష్యత్‌లో మరణాన్ని జయిస్తాడు. చనిపోయిన వారినీ బతికిస్తాడు. కానీ ప్రకృతికి విరుద్ధంగా చేసే ఏ పని ఆయినా వినాశనమే. దేవుని ఆజ్ఞను, ప్రకృతి నియమాలను ధిక్కరిస్తే భవిష్యత్‌ అంధకారం కాక తప్పదు. ఇందుకు ఒక భవిష్యత్‌ ఊహాజనిత […]

Written By:
  • NARESH
  • , Updated On : May 17, 2022 / 04:26 PM IST
    Follow us on

    World In 2070: ప్రపంచం సాంకేతక రంగంలో దూసుకుపోతోంది. శ్రమను సులభతరం చేసుకునేందుకు మనిషి యాత్రాలపై ఆధారపడుతున్నాడు. ఇందలో భాగంగానే అయేక వస్తువులు, పరికరాలు పుట్టుకొచ్చాయి. మనవ జీవిత సులభతరమైంది. మానవుడు తన మెదడుకు పదును పెడుతూ పోతే భవిష్యత్‌లో మరణాన్ని జయిస్తాడు. చనిపోయిన వారినీ బతికిస్తాడు. కానీ ప్రకృతికి విరుద్ధంగా చేసే ఏ పని ఆయినా వినాశనమే. దేవుని ఆజ్ఞను, ప్రకృతి నియమాలను ధిక్కరిస్తే భవిష్యత్‌ అంధకారం కాక తప్పదు. ఇందుకు ఒక భవిష్యత్‌ ఊహాజనిత కథనం చెప్పుకుందాం. 2070లో ఈ ప్రపంచం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికర అంశం. ఇప్పుడు టెక్నాలజీ విస్తరించి ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ వచ్చి ఈ ప్రపంచాన్ని మార్చేస్తుందన్నది నిపుణుల మాట.. మరి 2070లో ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం ఎలా ఉండబోతోందన్న దానిపై స్పెషల్ ఫోకస్.

    World In 2070

    రోజురోజుకూ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి తెలివి మందగిస్తోంది. ఇదివరకు మనం చాలా వరకు ఫోన్‌ నంబర్లు గుర్తుపెట్టుకునేవాళ్లం. ప్రస్తుతం యంత్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. అంటే యంత్రం ఆవిర్భావం మనిషిని సోమరిగా మారుస్తోంది అన్నమాట. సాంకేతికత పెరిగే కొద్ది మన మెదడుకు పని కూడా లేకుండా పోతోంది. కొంత మందికి భవిష్యత్‌ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో మన ముందు తరం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చేసిన చిన్న ప్రయత్నమే ఈ ఊహాజనిత కథ.

    Also Read: Pavan Kalyan Fans: విజయ్ దేవరకొండ పై విరుచుకుపాడుతున్న పవన్ కళ్యాణ్ ఫాన్స్

    -అంతా ఆర్టిఫీషియలే..
    2070వ సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అప్పటికీ ఎటు చూసినా యాత్రీకరణే కనిపిస్తుంది. జనాభా పెరిగి రోడ్లన్నీ మూసుకుపోతాయి. అందరూ ఎగిరే కార్లను ఉపయోగిస్తారు. భూమ్మీద పెట్రోలియం నిల్వలు అడుగంటడంతో ప్రత్యామ్నాయ ఇంధనంగా హీలయంను ఉపయోగిస్తారు. దీన్ని చంద్రుడి నుంచి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. మనిషి తన మెదడులోని న్యూరో సెల్‌ సహాయంతో క్వాంటమ్‌ కంప్యూటర్‌ రాజ్యమేలుతుంది. శారీరక శ్రమ తగ్గిపోతుంది. సూపర్‌ రోబోట్లు రాజ్యమేలుతాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే నిమిషాల్లో వస్తువులు డ్రోన్ల సాయంతో ఇంటికి వస్తాయి. అంతలా సాంకేతికత పెరిగిపోతుంది. సినిమాను కూడా చిన్న చిప్‌ సాయంతో వీక్షించే వీలు కలుగుతుంది. చేతికి అమర్చుకున్న వాచ్‌ సాయంతో మనిషి ఇంకొకరితో మాట్లాడగలుగుతాడు. మొత్తంగా ఇతరుల అవసరం లేకుండా మనిషి ఒంటరవుతాడు.

    World In 2070

    -నానో బ్లాక్‌లో సాయంతో పునర్జన్మ..
    మన సాంకేతికత ఎంత పెరిగినా మరణాన్ని జయించలేకపోతున్నాం. 2070 వరకూ దాన్ని సుసాధ్యం చేసే చాన్స్ ఉంది. ఆర్టిఫీషియల్‌ ఎక్స్‌పర్ట్‌ లు చనిపోయిన మనిషి మెమరీని కంప్యూటరలో భద్రపరుస్తారు. వారి సమచారాన్ని నానో బ్లాక్‌హోల్‌కి అనుసంధానం చేస్తే ఆ వ్యక్తి మళ్లీ బతికి వచ్చే చాన్సులు ఉంటాయట.. ప్రపంచం కూడా దీనికికోసం ఎదురు చూస్తుంటుంది. కానీ చనిపోయిన మనిషిని తిరిగి తీసుకురావడం అసాధ్యం.. దీనిని మనం సుసాధ్యం చేస్తాడా? లేదా? అన్నది అప్పటి తేలనుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ తో మనుషులను సృష్టించవచ్చని అంటున్నారు. కానీ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ కంటే మన మెదడు ఓ అద్భుతం. దానిని మించింది మాత్రం ఇది కాబోదు. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ సాయంతో రోబోలు సొంతంగా పనులు చేసుకుంటాయి.

    -సక్సెస్‌..
    నానో బ్లాక్‌ హోల్‌తో అసాధ్యం సుసాధ్యం అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ తో చనిపోయిన మనిషిని సృష్టించవచ్చని చెబుతున్నారు. కానీ మనిషి లాంటి ఆలోచన, నేను అనే భావన యంత్రాలకు ఎప్పుడూ రాదు. చనిపోయిన వ్యక్తిని సూపర్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌లోకి తెచ్చి యంత్రాలతో మన మెదడుపై పెత్తనం చెలాయించవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే రోబోటిక్ మిషన్లు, కంప్యూటర్లు మనిషి కంట్రోల్‌ తప్పి స్వతంత్రంగా వ్యవహరిస్తే వినాశనమే.. మన ‘రోబో’ సినిమాలా పరిస్థితి తయారవుతుంది. అప్పటి వరకు మనిషి ఆజ్ఞలు పాటించిన రోబోలు సొంతంగా పనిచేయడం ప్రారంభిస్తాయి.. దీంతో మానవ వినాశనం మొదలవుతుంది.

    మన భూమి ఒక మెకానికల్‌ కంప్యూటర్‌లా మారితే సూపర్‌ క్వాంటమ్‌ సిస్టం భవిష్యత్తు అంధకారమే అవుతుంది. ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ అధికారం చెలాయిస్తే ప్రకృతిని జయిస్తాం.. మరణాన్ని జయిస్తాం కానీ మన చేతిలో ఏమీ ఉండదు. యంత్రాలే అధికారం చెలాయిస్తాయి. అందుకే ప్రకృతి నియామాలకు విరుద్ధంగా ఏది చేసినా ప్రమాదమే..2070వరకు ఇదే జరగబోతుందని తెలుస్తోంది. ఇది ఊహాత్మకంగా పరిశోధకులు అంచనావేస్తున్న కథనే. అప్పటికి ఏం జరుగుతుందన్నది వేచిచూడాలి.

    Also Read:IPL 2022- RCB: ఆర్సీబీని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందేనా?

    Tags