Film Shooting Is Closed: ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగు సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తే.. పెట్టుబడి మిగలడం లేదు. ఫలితంగా కొందరు నిర్మాతలు సినిమాలు తీయడం మానేశారు. టికెట్ల రేట్లు పెంచినా.. ఆదాయం రాకపోగా సినిమా చూసేవారి సంఖ్య రోజురోజుకు తగ్గుతోంది. ఇదే సమయంలో ఓటీటీ రావడంతో ఈ సమస్య మరీ ఎక్కువైంది. ప్రతీ ఒక్కరూ థియేటర్ కు రాకుండా ఓటీటీనే ఫాలో అవుతున్నారు. దీంతో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో గతంలో సమావేశమైన నిర్మాతలు షూటింగ్ బంద్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగ్ బంద్ చేస్తామని అనుకున్నారు. కానీ మరోసారి బుధవారం సమావేశమై తుది ప్రకటన చేయనున్నారు. అయితే సినిమా షూటింగ్ లు బంద్ చేయడం వల్ల ఎవరికీ నష్టం..? నిర్మాతలకే కదా..? అని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
ఒక సినిమాను తీయాలంటే లో-బడ్జెట్ అయినా రూ.5 కోట్లు అవుతుంది. సినిమా బాగుంటేనే ఆ సినిమా ద్వారా లాభాలు వస్తున్నాయి. కాస్త అటూ ఇటూ అయినా కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. అయితే ఈ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ విషయం ఎలా ఉన్నా నటులు, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్స్ మాత్రం కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక సినిమాను ప్రారంభిస్తే కొందరు నటులు, టెక్నీషియన్స్ ముందే పారితోషికం ఇస్తారు. ఈ క్రమంలో ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన వారికి షూటింగ్ బంద్ చేస్తే నష్టాలే కదా..? అప్పుడు మైనస్ నిర్మాతలకే కదా..?
సినీ ఇండస్ట్రీలో ఎన్నో సమస్యలున్నాయి. అగ్రహీరోలకు కోట్ల రూపాయలు ఇస్తున్నారు. కానీ సాధారణ నటులకు కనీసం పారితోషికం ఇవ్వడం లేదని కొందరు పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. అటు టిక్కెట్ల రేట్ల విషయంలో ప్రతీసారి ప్రభుత్వంతో చర్చలు జరపడమే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. ఒకవేళ ఇలాంటి చర్చలు జరిపినా కొందరికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. దీంతో ఇండస్ట్రీలో వర్గాలుగా విడిపోయారు. ఒకరి మాట మరొకరు వినడం లేదు. ఫలితంగా సినిమా పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది.
Also Read: Nagarjuna- NTR: ఎన్టీఆర్ వల్లే నాగార్జునకి జాతీయ అవార్డు రాలేదు.. అసలేం జరిగింది అంటే ?
ఈ తరుణంలో నిర్మాతలు షూటింగ్ బంద్ చేస్తామని ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఆఫ్ చేయడం వల్ల ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. పారితోషికం తీసుకునే నటులు, టెక్నీషియన్లు బాగానే ఉంటారు. కానీ పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు వడ్డీభారం, రోజూ వేతనంపై వచ్చే సినీ కార్మికులపై ఈ ప్రభావం పడనుంది. దీంతో ఎటోచ్చి షూటింగ్ బంద్ చేయడం వల్ల నిర్మాతలకే నష్టం అని అంటున్నారు.
ఇక మరోసారి బుధవారం ఫిల్మ్ చాంబర్ లో సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. ఓటీటీ, నిర్మాణ వ్యయం అదుపు, పర్సంటేజీ విధానం, వీపీఎఫ్ చార్జీలు, టికెట్ రేట్ల విషయంపై చర్చించనున్నారు. అయితే ఈ సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడనున్నారు. కానీ ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్ బంద్ చేయడం ఖాయమంటున్నారు. కానీ చిన్న నిర్మాతలు, సినీ కార్మికులు మాత్రం షూటింగ్ బంద్ చేయకుండా సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలని అంటున్నారు. మరి నేటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందో చూడాలి..
Also Read: Pawan Kalyan Politics: బీజేపీనా..? టీడీపీనా.? ఏ పార్టీవైపు పవన్ మొగ్గు..?