https://oktelugu.com/

Netflix: భారత్ లో డిస్నీ+, అమెజాన్ ప్రైమ్ ను ఆదరించినంతగా ‘నెట్ ఫ్లిక్స్’ను ఎందుకు వినియోగించడం లేదు..?

Netflix: కరోనా పుణ్యమాని ఓటీటీల హవా సాగుతోంది. సినిమా థియేటర్లు మూత పడడంతో ప్రజలందరూ ఓటీటీ వేదికకు అలవాటు పడ్డారు. ఈ ప్లాట్ ఫాం పై ఉన్న వివిధ ఛానెళ్ల ద్వారా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలోని జోష్ లేకపోయినా కొందరు కుటుంబ సభ్యులు కలిసి ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకొని సినిమాలు చూస్తున్నారు. భారత్లో ఓటీటీ అతి తక్కువ కాలంలోనే విస్తరించింది. అయితే ఇందులోని కొన్ని ఛానెళ్లు మాత్రమే దూసుకుపోతున్నాయి. అమెజాన్, డిస్నీహాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2022 / 09:08 AM IST
    Follow us on

    Netflix: కరోనా పుణ్యమాని ఓటీటీల హవా సాగుతోంది. సినిమా థియేటర్లు మూత పడడంతో ప్రజలందరూ ఓటీటీ వేదికకు అలవాటు పడ్డారు. ఈ ప్లాట్ ఫాం పై ఉన్న వివిధ ఛానెళ్ల ద్వారా సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా థియేటర్లలోని జోష్ లేకపోయినా కొందరు కుటుంబ సభ్యులు కలిసి ఇంట్లోనే థియేటర్ ఏర్పాటు చేసుకొని సినిమాలు చూస్తున్నారు. భారత్లో ఓటీటీ అతి తక్కువ కాలంలోనే విస్తరించింది. అయితే ఇందులోని కొన్ని ఛానెళ్లు మాత్రమే దూసుకుపోతున్నాయి. అమెజాన్, డిస్నీహాట్ స్టార్ లాంటి ఛానళ్లు టాప్ ప్లేసులో ఉన్నాయి. అయితే ప్రముఖ ఛానెల్ ‘నెట్ ఫ్లిక్స్’ మాత్రం జనం ఆదరించలేకపోతున్నారు. వరల్డ్ వైడ్ గా నెట్ ఫ్లిక్ష్ సబ్ స్క్రైబర్లు కోట్ల మంది ఉన్నారు. కానీ భారత్ కు వచ్చే సరికి దాని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.

    2018 ఫిబ్రవరిలో జరిగిన ఓ సమావేశంలో నెట్ ఫ్లిక్స్ కు 10 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ అన్నారు. అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఆ దూకుడు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన మార్కెట్లలో నెట్ ఫ్లిక్స్ ను ఆదరిస్తున్నా భారత్లో మాత్రం వెనకబడిపోతుందని గత వారం ఓ ఇన్వెస్టర్ కాల్ లో హేస్టింగ్స్ వాపోయారు. భారత్లో 2 మిలియన్ డాలర్ల స్ట్రీమింగ్ మార్కెట్ తయారైందని మీడియా పార్ట్ నర్స్ ఆసియా తెలిపింది. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

    ప్రస్తుతం ఓటీటీ లెక్కల ప్రకారం భారత్లో డిస్నీ హాట్ స్టార్ 4.6 కోట్ల స్క్రైబర్లు ఉంటే ఆమెజాన్ ప్రైమ్ వీడియోకు 1.9 కోట్లు ఉన్నారు. అదే నెట్ ఫ్లిక్స్ కు మాత్రం కేవలం 55 లక్షలు మాత్రమే ఉన్నారు. ఇండియాలో 2018లో ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ ఆ తరువాత హిందీ చలనచిత్రాలతో ప్రభంజనం సృష్టించింది. ఈ సంస్థ తొలి ఒరిజినల్ సిరీస్ అందించిందంటూ ది ఎకనామిక్స్ మ్యాగజైన్ పేర్కొంది. కానీ పరిస్థితులు వేరేలా మారుతున్నాయి. ఇండియాలో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ చాలా పెద్దది. దేశంలో చాలా మందికి కేబుల్ కనెక్షన్ల ద్వారా తక్కువ ధరలో చానెళ్లు లభ్యమవుతాయి. అలాంటప్పుడు వీరు అన్ని రకాల వీడియోలు వచ్చే కేబుల్ టీవీనే ఎక్కువగా ఆదరిస్తారు.

    అయితే నెట్ ప్లిక్స్ ఇప్పటికీ మిగతా ఛానెళ్ల కంటే ఎక్కువ ఖర్చుతో సినిమాలను అందిస్తోంది. దీంతో వినియోగదారులు తక్కువ ధరకు లభించే వాటిపై మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో డిస్నీ ప్లస్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటోంది. భారత ప్రజల అభిరుచులను తెలుసుకొని వారికి అనుగుణంగా సినిమాలను అందిస్తోంది. ప్రధానంగా డిస్నీ ప్లన్ స్పోర్ట్స్ ను ఎక్కువగా ప్రసారం చేస్తోంది. ఐపీఎల్ టోర్నీతో సహా ప్రపంచకప్ లను అందిస్తూ పెద్ద పెద్ద డిజిటల్ ప్రసార హక్కులను కొనుగోలు చేస్తోంది.

    మరో ఓటీటీ సంస్థ ఆమెజాన్ ప్రాంతీయ భాషల్లో సినిమాలను అందుబాటులో ఉంచుతోంది. దేశంలో 10 భాషల్లో సినిమాలను, సిరీసులను అందిస్తోంది. గతేడాది విడుదలైన ‘ఫ్యామిలీ మాన్’ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అందుకు ప్రాంతీయ భాషల్లో విడుదల చేయడమే కారణంగా పేర్కొంటున్నారు. భారత్లో విడుదలయ్యే 40 శాతం సినిమాలు అమెజాన్ హక్కులు సాధిస్తోంది. దీంతో వినియోగదారులు ఎక్కువగా ఆమెజాన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

    నెట్ ఫ్లిక్స్ కూడా భారత్లో ఇమేజ్ కోసం అత్యదిక డాలర్లను వెచ్చించింది. సినిమాలు, సిరీస్ ల కోసం ప్రముఖ స్టూడియోలతో భాగస్వామ్యం ఒప్పందం చేసుకుంది. కానీ స్ట్రీమింగ్ షో లు నిర్వహించడంలోనూ.. ప్రాంతీయ భాషల్లో సినిమాలను విడుదల చేయడంలో విఫలమైందని మీడియా పార్ట్ నర్స్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ మిహిర్ షా తెలిపారు. అదే మిగతా వాటికంటే నెట్ ఫ్లిక్స్ భారత్ లో విఫలం కావడానికి కారణమంటున్నారు.

    అందుకే తాజాగా నెట్ ఫ్లిక్స్ తేరుకుంది. టాటా గ్రూప్ తో టై అప్ అయ్యింది. ‘టాటా స్కై’ నుంచి టా ప్లేగా మార్చి నెట్ ఫ్లిక్స్ ఉచితంగా అందిస్తున్నారు. టాటా ప్లేతో కలిసి భారతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు నెట్ ఫ్లిక్స్ ఇలా ఉచిత ప్రసారాలకు సిద్ధమైంది. మరి ఈ ఎత్తుగడ పనిచేస్తుందా? లేదా? అన్నది వేచిచూడాలి.