Allu Fans: ‘పుష్ప’కు కౌంటర్.. అవధాని ‘గరికపాటి’కే పాఠాలు చెబుతున్న ‘సినీ’ ఫ్యాన్స్..!

Allu Fans:  సినిమా అంటేనే అదొక ఊహ. అందమైన కళ లాంటిది. అందులో బక్కపలచని వ్యక్తి కూడా రాత్రికి రాత్రి కండలు పెరిగి బాహుబలి అవుతాడు.. అలా చూపిస్తేనే జనాలు చూస్తారు. తమను తాము అన్వయించుకుంటారు. హీరోగా భావిస్తారు. కేవలం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సాధనం ‘సినిమా’. అదో కల్పితం. అయితే సమాజంపై అది చూపించే ప్రభావం బలీయంగా ఉంటుంది. నందమూరి నటసింహం బాలయ్య ‘అఖండ’లో విలన్లను అడ్డంగా నరికాడని బయట ఆయన అభిమానులు అలాగే […]

Written By: NARESH, Updated On : February 4, 2022 1:11 pm
Follow us on

Allu Fans:  సినిమా అంటేనే అదొక ఊహ. అందమైన కళ లాంటిది. అందులో బక్కపలచని వ్యక్తి కూడా రాత్రికి రాత్రి కండలు పెరిగి బాహుబలి అవుతాడు.. అలా చూపిస్తేనే జనాలు చూస్తారు. తమను తాము అన్వయించుకుంటారు. హీరోగా భావిస్తారు. కేవలం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే సాధనం ‘సినిమా’. అదో కల్పితం. అయితే సమాజంపై అది చూపించే ప్రభావం బలీయంగా ఉంటుంది. నందమూరి నటసింహం బాలయ్య ‘అఖండ’లో విలన్లను అడ్డంగా నరికాడని బయట ఆయన అభిమానులు అలాగే కత్తులు కటార్లు పట్టుకొని నరకరు కదా.. కేవలం అది ఎంజాయ్ చేయడానికి మాత్రమే సరిపోతుంది. బయట అలాంటివి జరగవు. ఎందుకంటే అది సినిమా. బయట వాస్తవం. కానీ ఈ చిన్న పాయింట్ తెలియని అవధాని..ప్రవచనకర్త.. ఇటీవలే పద్మశ్రీ పొందిన ‘గరికపాటి నరసింహరావు’ గారు రెచ్చిపోయారు. సినిమా అనేది ప్రజలకు వినోదాన్ని పంచేది అన్న వాస్తవాన్ని పక్కనపెట్టి నోరు పారేసుకున్నారు. సామాన్యులు చేయలేని పనిని సినిమాల్లో స్టార్లు చేస్తే అన్వయించుకొని ఎంజాయ్ చేస్తుంటారు. గరికపాటిలా సినిమాల్లో అవధానం చెబితే ఎవరూ చూడరు. బయట జరగనవి చూపిస్తేనే అదొక అద్భుతంగా భావించి చూస్తారు.

ఈ చిన్న లాజిక్ ను మరిచిపోయిన మన గరికపాటి గారు తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప’పై నోరుపారేసుకున్నారు. కళాత్మక రంగంలో ఎందరో మేధావులు ఉండగా.. గరికపాటికి ‘పద్మశ్రీ’ రావడం నిజంగా గొప్పే. ఆయనకంటే మంచి  ప్రవర్తన కర్తలు ఉన్నారు. అయినా ఆయన ఏదో బీజేపీకి ఫేవర్ గా అప్పట్లో ‘దేశభక్తి’ గురించి.. మోడీ, సైనికుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పారని.. అందుకే ఆయనకు పద్మశ్రీ అవార్డు దక్కిందన్న గుసగుసలు, ప్రచారం సాగుతోంది. లాబీయింగ్ తో అవార్డు తెచ్చుకున్నారో లేదో తెలియదు కానీ.. ఆయనకు అవార్డు రాగానే తెలంగాణ బీజేపీ చీఫ్ కలిసి సన్మానించడం హాట్ టాపిక్ గా మారింది.

గరికపాటి ఒక టీచర్ గా పనిచేసి రిటైర్ మెంట్ తీసుకొని ఈ ప్రవచనాలపై పడ్డారు. ఆయన ప్రవచనాలు ఫక్తు.. మొగుడు పెళ్లాల గొడవలు.. ఇంట్లో ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలి? అక్రమ సంబంధాలు, ఇతర అందరూ ఆసక్తిగా చూసే వాటిమీదనే ఉంటాయి. భక్తి పాళ్లు తక్కువ అనే వాళ్లు కూడా ఉన్నారు. అయినా ఆయన ప్రవచనం ఆయనదే. కానీ ఇప్పుడు అనవసరంగా తనది కానీ సబ్జెక్ట్ సినిమా ఫీల్డ్ పై పడి ‘పుష్ప’ను విమర్శించగానే వార్తల్లో నిలిచారు. సినీ అభిమానులు, సినీ కళాకారులు ‘గరికపాటి’కి కౌంటర్లు ఇస్తున్నారు. కల్పితాలపై సినిమాలు తీసి అలరించే తమపై గరికపాటి నోరుపారేసుకోవడాన్ని సినీ కళాకారులు జీర్ణించుకోవడం లేదు. కాస్త గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

  • అసలు వివాదం ఏంటంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి అందరి తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్, ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లు రాబట్టి అల్లు అర్జున్ ను బాక్సాఫీస్ హీరోగా ‘పుష్ప’ నిలబెట్టింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’లో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోగా అలరించడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.

‘పుష్ప’లోని శ్రీవల్లి సాంగులోని చెప్పు స్టెప్, తగ్గెదేలే, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. తొలిసారి డీ గ్లామర్ రోల్ లో కన్పించిన బన్నీ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే ఈ మూవీపై ఇటీవల ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలు ఇటీవల వైరల్ అయ్యాయి.

Also Read: ఉద్యోగుల సమ్మెను లెక్కచేయని జగన్.. ఇంకా బెదిరింపు ధోరణే..

అవధాన ప్రక్రియ, ప్రవచనాల్లో ప్రసిద్ధుడైన గరికపాటి నరసింహారావుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కాగా ఓ ఛానల్ నిర్వహించిన ఇంటర్య్వూలో సినిమాల గురించి ఆయన ప్రస్తావించారు. సమాజానికి మంచి సందేశం ఇచ్చేలా సినిమాలు ఉండటం లేదన్నారు. ఈక్రమంలోనే ‘పుష్ప’ మూవీపై తనదైన శైలిలో ఆయన సైటర్లు వేశారు.

‘‘స్మగ్లింగ్‌ చేసే వ్యక్తిని హీరోగా చూపించడం ఎంతవరకూ సమంజసం.. స్మగ్లింగ్‌ చేసే వ్యక్తి ‘తగ్గేదే లే’ అంటాడా? ఇప్పుడు అదొక సూక్తి అయిపోయింది. ఒక కుర్రాడు ఎదుటివ్యక్తిని కొట్టి.. ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఈ డైలాగ్‌ వల్ల సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘తగ్గేదే లే’ అనేది హరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటి వారు వాడాలి. అంతేకానీ స్మగ్లర్లు కాదు..’’ అంటూ వ్యాఖ్యానించారు.

అంతేకాకుండా ఇది వరకు సమంజసమో హీరో, దర్శకుడి చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అల్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. సినిమాని సినిమాగా చూడాలని.. దాన్ని ఓ కళగా చూడాలే తప్పితే సినిమానే మొత్తం సమాజాన్ని మార్చేస్తుందని అనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ‘గురువు గారు సినిమాని సినిమాగానే చూడండి.. ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ చెప్పిన డైలాగ్ కారణంగా సమాజం చెడిపోయే పరిస్థితి లేదని’ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: సిరిసిల్ల‌లో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ భాగోతం