Youth dies while playing badminton: రాయిని తంతే 16 వక్కలయ్యే వయసు అది. ఆడుతూ పాడుతూ.. సరదాగా గెంతుతూ గడపాల్సిన వయసు అది.. ఆ వయసులో పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఉద్రేకానికి, ఉద్వేగానికి ప్రతీకలుగా కనిపిస్తుంటారు. ఆ యువకుడు కూడా అలానే ఉన్నాడు. పైగా తన స్నేహితులతో కలిసి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు.. సరదాగా ఆడుతూ పాడుతూ గడుపుతున్నాడు. అటువంటి యువకుడు ఒక్కసారిగా కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. చూస్తుండగానే కుప్పకూలిపోయాడు.
ఆ యువకుడు పేరు గుండ్ల రాకేష్. వయసు 25 సంవత్సరాలు. అత తండ్రి పేరు గుండ్ల వెంకటేశ్వర్లు. గతంలో ఆయన ఉపసర్పంచిగా పనిచేశారు. రాకేష్ స్వస్థలం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం. రాకేష్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి నాగోల్ ప్రాంతంలో ఉంటున్నాడు. రాకేష్ కు షటిల్ ఆడటమంటే చాలా ఇష్టం. నాగోల్ ప్రాంతంలో ఉన్న ఓ క్లబ్లో అతడు షటిల్ ఆడుతూ ఉంటాడు.. పైగా రాకేష్ కు ఎటువంటి వ్యసనాలు లేవు. మద్యం తాగడు. మాంసం అంతగా ముట్టడు.. శారీరకంగా చూస్తే బలంగా ఉంటాడు. అటువంటి యువకుడు షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తోటి స్నేహితులను నివ్వెరపరిచింది.
రాకేష్ ప్రతిరోజు వ్యాయామ చేస్తూ ఉంటాడు. మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తూ ఉంటాడు. అయితే ఉన్నట్టుండి అతడికి గుండెపోటు రావడం పట్ల స్నేహితుల జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇటీవల కాలంలో అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి చాలామంది చనిపోతున్నారు. వయసు తారతమ్యం లేకుండా ఉన్నట్టుండి కుప్పకూలిపోతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ తరహా మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఒక వయసు వారికే గుండెపోటు సంభవించేది. కానీ ఇప్పుడు వయసు అనేది తేడా లేకుండా గుండెపోటు అనేది సర్వసాధారణమైపోయింది. పైగా ఆకస్మాత్తుగా గుండెపోటు రావడం.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోవడం.. వంటి కేసులు పెరిగిపోయాయి.. అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో శరీరం నుంచి కొన్ని సంకేతాలు వస్తుంటాయని.. సాధ్యమైనంతవరకు వాటిని పరిశీలించి.. అప్పటికప్పుడు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. రాకేష్ విషయంలోను అదే జరిగిందని.. ఇలాంటి మరణాలు ఇటీవల కాలంలో పెరిగిపోవడానికి ప్రధాన కారణం జీవనశైలి అని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలిని మార్చుకుంటేనే ఇటువంటి మరణాలను అరికట్టవచ్చని సూచిస్తున్నారు.
షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి 25 ఏళ్ల యువకుడు మృతి
నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయిన రాకేష్
ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్టు నిర్ధారించిన వైద్యులు
మృతుడు ఖమ్మం జిల్లా తల్లాడ మాజీ ఉప సర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు కుమారుడు గుండ్ల… pic.twitter.com/v3rVaXM3gt
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2025