Oxygen Fraud: శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపయోగాలు అంటారు. అలాంటిదే ఇది కూడా. కాకపోతే తన దరిద్రాన్ని వదిలించుకోవడానికి.. డబ్బులు సంపాదించుకోవడానికి ఇతడు మోసాన్ని ప్రయోగించాడు. తెలివిగా మాట్లాడుతూ.. షుగర్ కోటెడ్ విషయాలు చెబుతూ తనను తాను గొప్పగా అభివర్ణించుకున్నాడు. దాని ద్వారానే డబ్బులు సంపాదించాడు. కానీ ఆ తర్వాతే అసలైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
అతడు ఒక స్కామర్.. షుగర్ కోటెడ్ మాటలు మాట్లాడుతూ.. బురిడీ కొట్టి ఇస్తాడు. ఎదుటివారిని మాటల్లో పెట్టి సులువుగా మోసం చేస్తాడు. తన ఖాతాకు డబ్బులు బదిలీ చేయించుకున్న తర్వాత.. మాట్లాడడం మానేస్తాడు. ఈ వ్యవహారంలో ఎదుటివారికి ఏమాత్రం అనుమానం రాకుండా చూస్తాడు. ఓ వృద్ధురాలు విషయంలో కూడా హృదయ సూత్రాన్ని పాటించాడు. ఏకంగా ఆరు లక్షలు ఖాతాలో ఎంచుకొని ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు.. ఇప్పుడు ఇతడి వ్యవహారం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడి వ్యవహార శైలిని చాలామంది తప్పు పడుతున్నారు. ఇలా మోసం చేయొచ్చా అంటూ మండిపడుతున్నారు.
ముందే చెప్పుకున్నాం కదా అతడు ఒక స్కామర్ అని.. అతడికి మాటలు చెప్పడం.. ముగ్గులోకి దించడం అలవాటు. అలా ఓ 80 సంవత్సరాల వృద్ధురాలిని సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్నాడు. తర్వాత ఆమెతో మాటలు మొదలుపెట్టాడు. అసలే ఒంటరిగా ఉన్న ఆమెకు అతని మాటలు నచ్చాయి. అతడు మాట్లాడుతుంటే హాయిగా అనిపించింది. అయితే తనను తాను ఆస్ట్రోనాట్ గా అతడు పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు తనపై ఆమెకు ఇష్టం కలిగేలా చేసుకున్నాడు. ఇక ఇదే క్రమంలో ఇటీవల ఆమెతో చాట్ చేస్తూ.. ” నేను అంతరిక్షంలో ఇరుక్కుపోయాను. నా స్పేస్ షిప్ పై దాడి జరిగింది. ఆక్సిజన్ కోసం డబ్బులు కావాలని” అడిగాడు. దీంతో ఆమె అతను చెప్పేది మొత్తం నిజమే అనుకొని.. 5000 పౌండ్లు బదిలీ చేసింది. అవి మనదేశంలో అయితే ఆరు లక్షల వరకు ఉంటాయి. ఎప్పుడైతే తన ఖాతాలో ఆరు లక్షలు జమ అయ్యాయో.. అప్పటినుంచి ఆ వృద్ధురాలితో మాట్లాడటం మానేశాడు.. ఈ విషయాన్ని వృద్ధురాలు సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది.. దీంతో అందరూ ఆమె మీద జాలిపోవడం మొదలుపెట్టారు.. ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో ఉంటే ఆక్సిజన్ ఎలా కొనుగోలు చేస్తాడు.. దానిని మీరు ఎలా నమ్మారు.. ఆరు లక్షలు ఎలా ఇచ్చారు.. అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.