https://oktelugu.com/

Crime News : కూతురు ప్రేమకు అడ్డు చెప్పడమే అతడి పాపమైంది.. చివరికి ఏం జరిగిందంటే..

రోజురోజుకు మనుషుల మధ్య బంధాలు బలహీనమవుతున్నాయి. చిన్న చిన్న వాటికి విచక్షణ కోల్పోయి తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో అంతిమంగా జరగరాని దారుణాలు జరుగుతున్నాయి. గుండెను మెలిపెట్టే విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 1, 2024 / 11:45 AM IST

    Crime News

    Follow us on

    Crime News :  ఉమ్మడి వరంగల్ జిల్లా దామెర మండలానికి చెందిన లక్ష్మి కి గతంలోనే వివాహం జరిగింది. అయితే మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. మొదట్లో వారి సంసారం సజావుగానే సాగినప్పటికీ.. ఆ తర్వాత విభేదాలు మొదలయ్యాయి. దీంతో అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాయంపేట హవేలీ కి చెందిన సునీల్ (36) అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే మొదటి భర్త ద్వారా లక్ష్మికి సిరి (16) కూతురు ఉంది. కూతురు ఉన్నప్పటికీ సునీల్ లక్ష్మీ ని పెళ్లి చేసుకున్నాడు. అయితే సిరి ఇటీవల ఒక వ్యక్తితో చనువుగా ఉంటోంది. ఇది సునీల్ కంటపడింది. రెండు మూడుసార్లు ఇదే తీరుగా సిరి ఆ యువకుడితో ఉండడంతో.. అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే సిరిని మందలించాడు..” నువ్వెంత నీ వయసెంత.. ఇలాంటి పనులు చేయవచ్చా.. ఇలా అయితే నీ భవిష్యత్తు ఏమవుతుంది? ఈ వయసులో నువ్వు దృష్టి పెట్టాల్సింది చదువు మీద.. ఇలాంటి వ్యవహారాల మీద కాదు. ఇలాంటి వ్యవహారాలు మంచివి కావు. గ్రామంలో పరువు పోతుంది. ఆ తర్వాత ఎంత అనుకున్నా ఉపయోగం ఉండదు. నువ్వు యుక్త వయసులో ఉన్నావు కాబట్టి ఇప్పుడు అన్ని బాగున్నట్టే కనిపిస్తాయి. తర్వాత ఏడ్చి గీ పెట్టినా ఉపయోగముండదని” సునీల్ సిరిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సునీల్ తనను అన్ని మాటలు అనేసరికి.. సిరికి కోపం వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని లక్ష్మికి చెప్పింది.

    పగతో ఏం చేశారంటే..

    సిరి తనతో చెప్పిన మాటలను లక్ష్మి సీరియస్ గా తీసుకుంది. సిరిని సునీల్ ఇబ్బంది పెడుతున్నాడని.. అనవసరంగా వేధిస్తున్నాడని పొరపడింది. అంతే తప్ప తన కూతురు చేస్తున్నది తప్పు అని గ్రహించలేకపోయింది. సిరి చెప్పిన మాటలతో కఠిన నిర్ణయం తీసుకుంది. పైకి మంచిగానే మాట్లాడుతూ.. లోపల మాత్రం కుత కుత ఉడికిపోయింది. రాత్రి భోజనం చేసిన తర్వాత సునీల్, లక్ష్మి, సిరి వేరువేరుగా పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సునీల్ గాడ నిద్రలో ఉండగా.. లక్ష్మి, సిరి మేల్కొన్నారు. ముందస్తుగా వేసుకొని ప్రణాళిక ప్రకారం పెట్రోల్ తెచ్చుకున్నారు.. ఆ పెట్రోల్ అతనిపై చల్లి.. నిప్పంటించారు. ఆ మంటలు తాకిడికి సునీల్ శరీరం 9% పైగా కాలింది. దీంతో స్థానికులు అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతడడు చనిపోయాడు. మృతుడి దగ్గర బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. లక్ష్మి, సిరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీనేజ్ వయసులో ఉన్న కూతురి ప్రేమను నిరాకరించినందుకు సునీల్ తన ప్రాణాలను కోల్పోయాడు. మొదటి భార్య ద్వారా ఒక కూతురు ఉన్నప్పటికీ.. లక్ష్మిని తన భాగస్వామిగా స్వీకరించాడు. అయినప్పటికీ ఆ మాత్రం కృతజ్ఞతలేని లక్ష్మి తన కూతురు చెప్పిన మాటలు నమ్మి చివరికి భర్తనే కడ తేర్చింది.. ఈ ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.