Bangalore : భార్య, భార్య తల్లి, భార్య తమ్ముడు ఇలా అత్తింటి వేధింపులు భరించలేక ఒక యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఎంతో మంది ఈ వేధింపులతో బలవుతున్నా.. అతుల్ మాత్రం బయటకు వచ్చి తనకు జరిగింది మొత్తం వివరించాడు. అత్తింటి వారి వేధింపులు, వారికి సహకరించే న్యాయమూర్తి, జ్యుడిషరీ వ్యవస్థలో మగవారికి న్యాయం జరగకపోవడం లాంటివి కూలం కుషంగా వివరించాడు. అమెరిక్ అధ్యక్షుడు ట్రంప్ కు, కుభేరుడు ఎలన్ మస్క్ కు ఈ విషయంలో భారత్ ను ప్రశ్నించాలి ఎక్స్ వేదికగా మెసేజ్ పెట్టిమరీ సేసైడ్ చేసుకున్నాడు. దీంతో పోలీసులు భార్య, ఆమె తల్లి, ఆమె తమ్ముడిపై కేసు నమోదు చేసి ఈ రోజు (డిసెంబర్ 15) అరెస్ట్ చేశారు. అతుల్ ఒక్కడే ఈ కేసులకు బలైన వ్యక్తి కాదు.. ఎంతో మంది అత్తింటి వారిని అనిచివేసేందుకు.. అత్తింటి వారిని పుట్టింటి వారి చేతిలో కీలు బొమ్మలుగా మార్చేందుకు ఈ కేసులను వినియోగించుకుంటున్నారు. ఎందుకు..? చట్టాలు వారికి అనుకూలంగా ఉన్నాయని. అతడి నుంచే డబ్బులు తీసుకొని ఆ డబ్బులను తమ లాయర్లకు చెల్లించి అతన్నే నాశనం చేసే వెసులుబాటును మన భారత న్యాయ వ్యవస్థ కల్పిస్తుంది. అతుల్ చనిపోయినంత మాత్రాన ఏదో మార్పు జరుగుతుందనుకోవడం మూర్ఖత్వమే. ఆడవారికి చుట్టాలుగా మారిన ఈ చట్టాలకు అగేనిస్ట్ గా ఎంతో మంది ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ వాటిలో పెద్దగా మార్పులేదు. మొత్తంగా పరిశీలిస్తే ఒక్క అరెస్ట్ మాత్రం తీసి వేశారు. తప్ప అన్నీ సేమ్ టు సేమనే చెప్పాలి.
ఎవరో మా తాత, ముత్తాలు.. లేదంటే మా తండ్రులు ఆడవారిని కట్నం కోసం వేధించారని ఇప్పుడు వారి మనుమళ్లను, వారి కొడుకులను శిక్షించడం బహూషా భారత న్యాయ వ్యవస్థలోనే కనిపిస్తుందేమో. 498/ఏ వచ్చిన కొత్తలో కేసుల తాగిడిపెరగడంతో ఒక కమిషన్ వేసి అధ్యయనం చేసిన ప్రభుత్వ పెద్దలకు చుక్కలు కనిపించాయి. అందుకే అరెస్ట్ తొలగించారు. అంటే అవన్నీ ఫాల్స్ కేసులు అని తెలిసిందిగా.. మరి ఆ ఫాల్స్ కేసుల గురించి కోర్టుల చుట్టూ తిప్పడం దేనికి అనే విషయం అదే పెద్దలకు తెలియదా..?
భర్త, అత్తిళ్లు, ఆడబిడ్డలు, ఆడ బిడ్డ భర్తలపై కేసులు వేస్తే వారినైనా వేగంగా కేసుల నుంచి తొలగిస్తే బాగుంటుంది అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. కానీ వారిని భయపెడితే అత్తింటిపై వారు ప్రెషల్ పెడతారు. దీంతో పుట్టింటి వారికి అత్తింటిని బానిసగా మర్చవచ్చు అని ప్రతీ భార్య కల కంటూనే ఉంది. అతుల్ పై 9 కేసులు పెట్టారని ఆయన చెప్పుకచ్చారు. కానీ అంతకన్నా ఎక్కువ కేసుల్లో చిక్కుకున్న మగవారు లేకపోలేదు.
అతుల్ చనిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది. భార్య, అతుల్ అత్తింటి వారిని అరెస్ట్ చేశారు. విచారణ ప్రారంభం అవుతుంది.. ఏమవుతుంది.. ఇందులో చాలా విషయాలు బయటకు రావాలి. అసలు ఆ వీడియోలో ఉన్నది అతుల్ అనే తన భర్తనేనా అనేది నిరూపణ కావాలి. దానికి కొన్నేళ్లు పడుతుంది. ఆయన రాసిన సూసైడ్ నోట్ ఆయన హ్యాండ్ రైటింగేనా అనేది మరోటి రుజువు కావాలి ఇలా చాలా రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. అప్పటి వరకు వీరిని జైలులో ఉంచి తిండి పెట్టి సాదరు కాబట్టి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బెయిల్ పై బయటకు వచ్చిన వీరు సాధారణ జీవితం గడిపేందుకు కొంత సమయమైతే పడుతుంది. కానీ ఆ తర్వాత అంతా మామూలులైపోతుంది.
కేసు రుజువైనా పెద్దగా ఒరిగేమీ ఉండదు. పెద్ద శిక్ష పడుతుందని ముందే ఫిక్స్ అయి ఉంటారు కాబట్టి ఎంత పడినా పెద్దగా కేర్ చేయకపోవచ్చు. ఇక కోర్టు కూడా దయతో వ్యవహరిస్తే నికితకు కొడుకు ఉన్నాడు కాబట్టి తక్కువ శిక్షే విధించవచ్చు. ఇక తల్లి, తమ్ముడిపై పెద్దగా ప్రభావం ఉండదని చెప్పవచ్చు. తక్కువ శిక్షలోనే బయటకు రావచ్చు.
ఎటు తిరిగి నాశనం అయ్యింది అతుల్ తల్లిదండ్రులు, అతని కొడుకు మాత్రమే. అతుల్ ఉన్నా కూడా జీవితకాలం చేయని తప్పులకు కోర్టుల చుట్టూ తిరిగేందుకే సరిపోతుంది. భారత దేశంలో మూడు ముళ్లు వేశామంటే నాశనం కావాల్సింది పురుషుడే. ముమ్మాటికీ ఇదే సత్యం. అదే తాగుబోతు.. తిరుగుబోతు.. భర్త అయితే ఏ భార్య అయినా కేసులు వేసి నా భర్త నాకు కావాలని కోరుకోదు. విడాకులు కావాలని కోరుకుంటుంది. సమాజం, సంఘం, న్యాయ వ్యవస్థను గౌరవించే వారు మాత్రమే ఈ కేసులకు బలవుతుంటారు.