https://oktelugu.com/

Uttar Pradesh : జ్యూస్ లో మూత్రం కలిపి విక్రయం.. సోనూ సూద్ తాగింది కూడా అదేనేమో.. వీడియో వైరల్..

ఆహారంలో కల్తీ పదార్థాలు కలపడం.. రుచి రావడానికి రసాయనాలు జోడించడం.. భారీగా వెనుకేసుకోవడానికి కుళ్ళిపోయిన కూరగాయలు వాడటం.. ఇలాంటి వార్తలను మనం తరచూ చదువుతూనే ఉంటాం. న్యూస్ చానల్స్ లో చూస్తూనే ఉంటాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వీటన్నింటికీ మించిన సంఘటన జరిగింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2024 / 09:51 PM IST

    Urine mixed with juice for sale in Uttar Pradesh

    Follow us on

    Uttar Pradesh : ఆ మధ్య తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండలో బాదంపాలు విక్రయించే ఓ వ్యక్తి అందులో వీర్యం కలుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆహార నాణ్యత విభాగం అధికారులు తనిఖీ చేయగా అది నిజమేనని తేలింది. తర్వాత అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి.. జైలుకు పంపించారు. ఈ ఉదంతాన్ని మర్చిపోకముందే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియా బాద్ ప్రాంతంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి కొడుకు నిర్వహించే జ్యూస్ షాపులో దారుణం బయటపడింది. వారు తయారు చేస్తున్న జ్యూస్ లో మూత్రం కలిపి విక్రయిస్తున్నట్టు తెలిసింది. వినియోగదారుల ఫిర్యాదుతో పోలీసులు ఆ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఆ దుకాణంలో మూత్రంతో కూడిన ఒక డబ్బాను గుర్తించారు. ఆ షాప్ నిర్వహించే వ్యక్తి పేరు ఆమీర్ అని.. అతడు మైనర్ అయిన తన కొడుకుతో ఈ వ్యవహారం కొనసాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. వారిద్దరిని విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.. బయట ఆహారం తినేవాళ్లు.. పండ్ల రసాలు తాగేవారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు..” కస్టమర్ల ఫిర్యాదుతో ఈ షాప్ తనిఖీ చేసాం. ఒక డబ్బాలో మూత్రం నిల్వ చేశారు. ఆ మూత్రం కూడా చాలా ఘాటైన వాసన వస్తోంది. ఇదే విషయాన్ని అమీర్ ను అడిగితే అతడు నిజం ఒప్పుకున్నాడు.. అతడిని అరెస్ట్ చేసాం. అతడి కొడుకుని కూడా అదుపులోకి తీసుకున్నామని” పోలీసులు చెబుతున్నారు.

    సోను సూద్ కూడా అదే తాగాడా..

    ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూ సూద్ ఈ జ్యూస్ సెంటర్ కు తరచూ వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. అమీర్ కష్టపడి జ్యూస్ సెంటర్ పెట్టుకోవడాన్ని అతడు పలు సందర్భాల్లో మెచ్చుకున్నాడు. అనేకసార్లు ఇక్కడికి వచ్చాడు.. ఇటీవల కాలంలో ఈ జ్యూస్ సెంటర్ ను సందర్శించాడు. ఆ జ్యూస్ సెంటర్ ను సందర్శించిన సమయంలో అమీర్ తో మాట్లాడాడు.. అతడి కొడుకును అభినందించాడు..” సోనుసూద్ ఇటీవల కాలంలో ఈ జ్యూస్ సెంటర్ ను అనేకసార్లు సందర్శించారు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడ జ్యూస్ తాగారు. జ్యూస్ షాప్ నిర్వాహకుడు అమీర్ ను అభినందించాడు. అతని పడుతున్న కష్టాన్ని కీర్తించాడు. ఇలా కష్టాన్ని నమ్ముకుని పైకి రావచ్చని.. ఇతడిని చూసి చాలా నేర్చుకోవాలని సోనూ సూద్ వ్యాఖ్యానించాడని” స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఉదంతాన్ని కొంతమంది సోనుసూద్ కు ట్విట్టర్లో ట్యాగ్ చేయడం విశేషం. మరోవైపు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.