https://oktelugu.com/

Uttar Pradesh: కర్వా చౌత్ కోసం ఇంటికి పయనం.. బైక్ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి దారుణం.. మహిళా కానిస్టేబుల్ జీవితాన్నే చీకటిగా మార్చింది..

కర్వా చౌత్.. ఉత్తర భారత దేశంలో ప్రముఖమైన పండుగ. కట్టుకున్న వాడు బాగుండాలని.. తన ఆరోగ్యం కూడా గొప్పగా ఉండాలని.. సంసారం అన్యోన్యంగా సాగాలని.. ప్రతి మహిళ తన భర్తతో జరుపుకునే పండుగ అది. ఆ పండుగ కోసం ఓ లేడీ కానిస్టేబుల్ సొంత గ్రామానికి పయనమైంది. కానీ ఆ రాత్రి ఆమెకు కల్లోలాన్ని మిగిల్చింది. చివరికి అది ఆమె జీవితాన్ని చీకటి మయంగా చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 22, 2024 / 08:04 AM IST

    Uttar Pradesh(3)

    Follow us on

    Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. అయోధ్యలోని రిజర్వ్ పోలీస్ అనుబంధ విభాగంలో మహిళ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది. తన కుటుంబంతో కలిసి కాన్పూర్ జిల్లాలో కార్వా చౌత్ పండుగ జరుపుకోవడానికి శనివారం పయనం అయింది. కాన్పూర్ లో దిగిన అనంతరం ఆమెకు పక్కనే ఉండే ధర్మేంద్ర పాశ్వాన్ అనే వ్యక్తి బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. అయితే రాత్రి కావడంతో ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అతని దుర్మార్గం తెలిసి ఆ మహిళా కానిస్టేబుల్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆ చీకట్లోనే అక్కడి నుంచి ఆమె పోలీస్ అవుట్ పోస్టు వద్దకు చేరుకుంది. తనపై ధర్మేంద్ర పాస్వన్ అత్యాచారం జరిపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వాళ్ళ సెక్షన్ల కింద ధర్మేంద్ర పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు.

    తెలిసినవాడని బైక్ ఎక్కింది

    ఆ హెడ్ కానిస్టేబుల్ గ్రామానికి సాయంత్రమైతే బస్సులు వెళ్లవు. దీంతో ధర్మేంద్ర కాన్పూర్లో కనిపించడంతో.. తన బైక్ పై ఇంటిదాకా డ్రాప్ చేయాలని కోరడంతో.. అతడు ఒప్పుకున్నాడు. పైగా ఆ మహిళా హెడ్ కానిస్టేబుల్ కు ధర్మేంద్ర చాలా కాలం నుంచి తెలుసు. దీంతో నమ్మకంగా అతని బైక్ ఎక్కింది. సాయంత్రం కావడంతో ధర్మేంద్ర తన బైక్ ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికీ అనుమానం వచ్చి ఆమె అతడిని ప్రశ్నిస్తూనే ఉంది. “ఇలా అయితే దగ్గర దారిలో వెళ్ళవచ్చని” అతడు నమ్మబలికాడు. అతడు ఆ మాటలు చెబుతున్నప్పటికీ, ఆమెకు ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. చివరికి ఆమె అనుమానం నిజమైంది. ఆ నిర్మానుష్య ప్రదేశంలో బైక్ ఆపిన అతడు.. ఆమె పై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేస్తున్నప్పటికీ దారుణానికి ఒడిగట్టాడు. అయితే దీనిని ఉత్తర ప్రదేశ్ హోంశాఖ అత్యంత సీరియస్ గా పరిగణించింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేయించింది.. అయితే ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయితే ధర్మేంద్రను కఠినంగా శిక్షించాలని ఉత్తర ప్రదేశ్ మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.