Crime News : అలాంటి ప్రపంచంలో అడుగు పెట్టే వాళ్లకు మత్తు లభించే సంగతేమోగాని.. జేబులకు చిల్లు పెట్టే కార్యం మాత్రం దర్జాగా సాగిపోతోంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలి, బంజారా హిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాలలో పబ్ లకు కొదవ ఉండదు. పైగా ఈ ప్రాంతాలలో ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు. కాస్త విశ్రాంతి పొందాలని పబ్ లకు వెళ్లేవారు నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తోంది. పబ్ కు వెళ్ళిన వెంటనే పక్కనే ఒక అందమైన అమ్మాయి పరిచయం లేకపోయినప్పటికీ పలకరిస్తుంది. ఆ తర్వాత ఓ నవ్వు నవ్వి వివరాలను తెలుసుకుంటుంది. తన బాయ్ ఫ్రెండ్ రాలేదని.. ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోయాడని కల్లబొల్లి కబుర్లు చెప్పి మాటల్లో పెడుతుంది. ఇవన్నీ నిజమేనని సొల్లు కార్చితే.. చేయాల్సిన పని మొత్తం చేసేసి వెళుతుంది. ముందుగా మాటల్లో పెట్టి.. ఆ తర్వాత వలపు బాణాలు వేస్తుంది. కౌగిట్లోకి తీసుకొని.. అందరు చూస్తుండగానే ముద్దులు పెడుతుంది. ఆ తర్వాత సిగరెట్ వెలిగించి… తను కూడా దమ్ముల మీద దమ్ములు లాగుతుంది. ఆ తర్వాత చీర్స్ అంటూ మందు తాగుతుంది. చేతిలో చేయి వేసి కాలు కదుపుతుంది. రొమాన్స్ చేద్దామంటూ కాలు మీద కాలు వేస్తుంది. ఆ తర్వాత ఆ మైకం నుంచి సదరు వ్యక్తి తేరుకునే లోగానే మాయమవుతుంది. ఈలోగానే పబ్ నిర్వాహకులు బిల్లు చేతులో పెడుతున్నారు. వేలకు వేలను వసూలు చేస్తున్నారు.
హైదరాబాదులో దందా
హైదరాబాదు నగరంలోని పలు పబ్ లలో ఈ తరహా దందా దర్జాగా సాగుతోంది. అయితే ఇలాంటి వ్యవహారాలపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పబ్ ల నిర్వాహకులు ఏమాత్రం మారడం లేదు. పైగా ఇతర ప్రాంతాల నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి.. ఇలాంటి చీకటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ పబ్ లో నిర్వాహకులు ఇలాంటి వ్యవహారాలు చేపట్టి కస్టమర్ల నుంచి భారీగా లాగారు. బంజారాహిల్స్ లోని ఓ పబ్ లో అమ్మాయిలను తీసుకువచ్చి దర్జాగా ఆ సాంఘిక కార్యకలాపాలు చేపట్టారు. ఇక ఇటీవల ఓ పబ్ లో పోలీసులు దాడులు చేశారు. 42 మందిని అద్బులోకి తీసుకున్నారు. ఇందులో 20 మంది వివాహితులు.. 22 మంది యువతులు. వీరంతా కూడా ఆర్థిక అవసరాలకు పబ్ కు వెళ్తున్నారు. అక్కడికి వచ్చిన వారితో చనువుగా ఉంటూ పబ్ నిర్వాహకులు చెప్పినట్టు చేస్తున్నారు. ఆ తర్వాత బిల్లుపై కమిషన్ తీసుకొని ఆర్థిక అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇదే విషయాన్ని పోలీసుల ఎదుట చెప్పి ఆ మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ పబ్ లకు వెళ్లేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని.. ముక్కు ముఖం తెలియని మహిళలు పక్కకు వచ్చి కూర్చొని రకరకాల విన్యాసాలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. గతంలో బంజారాహిల్స్ లోని కొన్ని పబ్ లలో 175 మందిని ఇదే తరహాలో.. మాదాపూర్ లోని ఓ పబ్ లో 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.