https://oktelugu.com/

Canada : వంటగదిలో గొడవ.. కెనడాలో భారతీయ విద్యార్థి హత‍్య వెనుక దారుణ నిజాలు

ఇంతకాలం అమెరికాకే పరిమితమైన భారతీయ విద్యార్థుల హత్యల పరంపర.. ఇప్పుడు కెనడాకూ పాకింది. ఇప్పటికే అమెరికా వెళ్లిన విద్యార్థులు వివిధ కారణాలతో మరణిస్తున్నారు. తాజాగా కెనడాలనూ అదే పరిస్థితి నెలకొంది. భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 6, 2024 / 11:18 PM IST

    Indian student murder In Canada

    Follow us on

    Canada :  అగ్రరాజ్యం అమెరికాలో.. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయులు వివిధ కారణాలతో ఇటీవలి కాలంలో మరణిస్తున్నారు. కొందరు ప్రమాదవశాత్తు మరణిస్తుంటే.. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొందరు హత్యకు గురవుతున్నారు. ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అక్కడి సూపర్‌ మార్కెట్‌లో దుండగులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఆరు నెలల క్రితమే అమెరికా వెళ్లి హత్యకు గురయ్యాడు. ఇలా అమెరికాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. తాజాగా కెనడాకూ ఆ సంస్కృతి పాకింది. అమెరికా తర్వాత భారతీయులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో కెనడా కూడా ఒకటి. ఇటీవలే రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అయినా విద్యార్థులు సురక్షితంగానే ఉన్నారు. కానీ తాజాగా ఇద్దరు స్నేహితల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది.

    వంటగదిలో గొడవ..
    భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం లూథియానాకు చెందిన గురాసిస్‌సింగ్‌(22) ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల క్రితం ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాడు. అక్కడి సర్నియా నగరంలో లాంబన్‌ కాలేజీలో చేరాడు. స్థానికంగా ఓ అపార్ట్టెమెంట్‌లో తన 34వ క్రాస్లీ హంటర్‌తో కలసి ఉంటున్నాడు. నవంబర్‌ 30న రాత్రి తన రూమ్‌లో ఓ విషయంలో గురుసిస్‌కు, హంటర్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ హత్యకు దారితీసింది. కిచెన్‌లో ఉన్న గురుసిస్‌పై హంటర్‌ కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో గురుసిస్‌ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

    పోలీసుల అదుపులో నిందితుడు..
    ఈ ఘటన అనంతరం గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. నిందితుడ హంటర్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్యపై విచారణ జరుపుతున్నట్లు సర్నియా పోలీస్‌ అధికారి డేవిస్‌ తెలిపారు. ఈమేరు గురుసిస్‌ సింగ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు. గురుసిస్‌ హత్యపై లాంబన్‌ కాలేజీ యాజమ్యాం విచారం వ్యక్తం చేసింది.

    కెనడా, భారత్‌ మధ్య విభేదాలు..
    ఇదిలా ఉంటే.. సిక్కు వేర్పాటు వాది, ఖలిస్తానీ ఉగ్రవారి హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య విషయమై భారత్‌, కెనడా మధ్య విభేదాలు తలెత్తాయి. నిజ్జర్‌ హత‍్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. ఎలాంటి ఆధారం చూపకుండా ఆరోపించడాన్ని భారత్‌ తప్పు పట్టింది. ఇటీవల భారత రాయబారులను విచారణ చేసేందుకు యత్నించింది. నిందితుల జాబితాలో చేర్చింది. దీంతో భారత్‌ ఆగ్రహం ‍వ్యక్తం చేసింది. భారత రాయబారులను వెనక్కి రప్పించి.. భారత్‌లోని కెనడా రాయబారులను బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.