Maharashtra : మనకు ఏదైనా సమస్య వస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. అక్కడ కూడా న్యాయం జరగకపోతే న్యాయవాది దగ్గరికి వెళ్తాం. అతడు అంతిమంగా ఆ సమస్యను కోర్టు దృష్టికి తీసుకెళ్తాడు. న్యాయమూర్తి సమక్షంలో న్యాయం జరిగేలా వాదిస్తాడు. ఇది ఒక పద్ధతి. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ లాయర్ కు సమస్య వచ్చింది. దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక అతడు ఏం చేశాడంటే..
మహారాష్ట్రలోని ముంబై ప్రాంతంలో ధృతి మాన్ జోషి అనే న్యాయవాది కుటుంబం దాదర్ ఈస్ట్ ప్రాంతంలో నివసిస్తోంది.. 1938 ప్రాంతం నుంచి ధృతి మాన్ జోషి కుటుంబం ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నది.. గత ఆగస్టు 15 నుంచి ధృతి మాన్ జోషి అన్ని నివసిస్తున్న ఇంట్లో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. ఆ ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండర్లు, పంట పాత్రలు, డోర్ లాచ్ లతో సహా అనేక వస్తువులను దొంగలు చోరీ చేస్తున్నారు.. మొదట్లో ఈ దొంగతనాలు చిన్న వస్తువులతో మొదలయ్యాయి. ఆ తర్వాత దొంగతనాల స్థాయి పెరిగింది.. సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు చేసే దొంగతనాలు రికార్డు కాలేదు. దీంతో గత్యంతరం లేక ధృతి మాన్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కోర్టును ఆశ్రయించాడు..ధృతి మాన్ జోషి కొత్త ఇంటికి మారడంతో.. గతంలో ఉన్న ఇంటిని అలానే వదిలేశాడు. అయితే అందులో కొన్ని వస్తువులను అక్కడే ఉంచాడు. ఆ వస్తువులను గత కొద్ది రోజులుగా దొంగలు వరుసగా చోరీ చేస్తున్నారు.. పాత ఇంట్లో వరుసగా దొంగతనాలు జరుగుతున్నప్పుడు ధృతి మాన్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో వారు అతడిని ఎగతాళి చేశారు.
పాడుబడిన ఇంట్లో..
శిథిలావస్థకు చేరిన ఇంటిని వదిలేసి..ధృతి మాన్ జోషి కొత్త ఇంట్లోకి మారాడు. మారుతున్న సమయంలో కొన్ని వస్తువులను పాత ఇంట్లో వదిలిపెట్టాడు. దీంతో దొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారు. అయితే దీనిపై ధృతి మాన్ జోషి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎగతాళి చేశారు. పైగా వదిలిపెట్టిన ఇంట్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమని ధృతి మాన్ జోషి కి వివరించారు. అయితే ధృతి మాన్ జోషి న్యాయవాది కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారు అంత తీవ్రంగా దర్యాప్తు చేపట్టలేదని ధృతి మాన్ జోషి ఆరోపిస్తూ బాంబే హైకోర్టు ను ఆశ్రయించారు.. తన పక్కన ఉన్న గృహాలలో కూడా ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని ధృతి మాన్ జోషి హైకోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తులు రేవతి, దేరే, పృథ్వీరాజ్ చవాన్ తో కూడిన ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. విచారణ క్రమంలో సబ్ ఇన్ స్పెక్టర్ కోర్టు ఎదుట హాజరయ్యారు.. ఆ ప్రాంతంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా పెట్టామని.. త్వరలో వారిని పట్టుకుంటామని వివరించారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించామని.. అందులో కొందరు అనుమానాస్పద వ్యక్తులు కనిపించారని ముంబై పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాగరే కోర్టు ఎదుట వివరించారు. పోలీసులు ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని.. కేసు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. అయితే ఈ కేసు కు సంబంధించిన పురోగతిని, తాజా సమాచారాన్ని తమకు అందించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 25 కు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. తన ఇంట్లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలని ధృతి మాన్ జోషి కోర్టుకు వెళ్లడం.. కోర్టు ఈ విధంగా తీర్పు ఇవ్వడంతో సంచలనంగా మారింది.