https://oktelugu.com/

Hyderabad : ఇంట్లో ఎవరూ లేరని ప్రియురాలి పిలిచిందని వెళ్లాడు.. పగోడికి నీ కష్టం రావద్దు భయ్యా!

ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రియురాలు పిలిచిందని వెనకా ముందు చూసుకోకుండా వెళితే ఇలాగే ఉంటుందని అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 24, 2024 / 05:16 PM IST

    Boyfriend, Girlfriend

    Follow us on

    Hyderabad : ప్రేమ ఎంతకైనా తెగిస్తుంది.. అని అంటారు. ఇదే సమయంలో ఒక్కోసారి చావు దెబ్బలు తినడానికీ కారణమవుతుంది. ప్రియురాలిని దక్కించుకోవడానికి కొందరు యువకులు సాహసం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా ఓ యువకుడు ప్రియురాలి పిలిచిందని వెళ్లి రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నాడు. చావు అంచుల వరకు వెళ్లి చివరికి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ఇంతకీ అసలు కథ ఏంటంటే..?

    హైదరాబాద్ లోని పాత బస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ఓ యువకుడు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పాటు పోలీసులకు పంపించాడు. తనను కాపాడాలని ప్రాథేయపడ్డాడు. తాను ప్రమాదంలో ఉన్నానని చెబుతూ తాను తిన్న గాయాలను చూపాడు. టెక్నాలజీ ఉపయోగించి యువకుడి అడ్రస్ ను కనుగొన్న పోలీసులు అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ యువకుడు పోలీసులకు చెప్పిన ప్రకారం..

    తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని.. తనను ఇటీవల ఒక రోజు ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ఇంటికి రమ్మన్నదని చెప్పాడు. దీంతో ఎంతో సంతోషంగా ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు.. ఆమెతో కాస్త సరదాగా ఉన్న సమయంలోనే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడిపై దాడి చేశారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కేకలు పెట్టాడు. చివరికి ఎలాగోలా తప్పించుకొని ఆ భవనంలోని ఓ గదిలోకి వెళ్లి దాక్కున్నాడు.

    ఆ తరువాత సెల్పీ వీడియో తీసి అందరికి పంపించాడు. అయితే తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆ యువకుడు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో తన ప్రియురాలితో మాట్లాడించాలని ఆ యువకుడు కోరాడు. అయితే ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకోవాలని పోలీసులు అతడిని సముదాయించారు. ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రియురాలు పిలిచిందని వెనకా ముందు చూసుకోకుండా వెళితే ఇలాగే ఉంటుందని అంటున్నారు.