Leopard : ఒకప్పుడు విస్తారంగా అడవులు ఉండేవి. ఆ అడవులను ఆవాసంగా చేసుకొని జంతువులు నివసించేవి. ప్రకృతి రమణీయతకు, జీవవైవిధ్యానికి పెట్టింది పేరు లాగా ఆ జంతువులు ఉండేవి. ఆహారపు గొలుసుకట్టు విధానం ద్వారా ఆ జంతువులు మునగడ సాగించేవి. కానీ కాలక్రమంలో అభివృద్ధి పేరుతో మనిషి అడవులను నాశనం చేయడంతో.. ఆ అడవి జంతువులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. అంతరించిపోగా.. మిగిలిన జంతువులు అడవుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నాయి. అయినప్పటికీ వాటి బతుకుకు భరోసా లేకుండా పోయింది. ఏ మూల నుంచి ఏ ప్రమాదం వాటిని చంపేస్తోందో అంతుపట్టకుండా ఉంది. తాజాగా ఇలాంటి సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రంలో విస్తారంగా అడవులు ఉంటాయి. ముఖ్యంగా రామానగర్ – మాగడి ప్రాంతాల మధ్య దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అడవి నుంచి రోడ్డున దాటుతున్న ఓ చిరుత పులి రోడ్డు ప్రమాదానికి గురైంది. చిరుత పొట్ట, వెనుక కాళ్లకు తీవ్రంగా గాయాలయ్యాయి.. ఆహార అన్వేషణలో భాగంగా ఆ చిరుత పులి రోడ్డు దాటుతూ వెళ్తోంది. ఈ సమయంలో అటువైపు నుంచి వేగంగా వస్తున్న ఓ బైకర్ ఆ చిరుతపులిని చీకట్లో గమనించలేకపోయాడు. అదే వేగంతో దానిని గుద్దాడు. ఈ ప్రమాదంలో చిరుత పులి అంతెత్తున లేచి కింద పడింది. ఈ ప్రమాదంలో దాని ఉదర భాగం కోతకు గురయింది. వెనుక కాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆ పులి అక్కడే పడిపోయింది.
అయితే ఈ దృశ్యాన్ని అటుగా వెళుతున్న కొంతమంది చూసి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆ చిరుత పులిని కూడా పశు వైద్యశాలకు పంపించారు.. అయితే చిరుతపులిని ఢీకొట్టిన వ్యక్తి కాలు కూడా విరిగినట్టు తెలుస్తోంది. అతని తలకు, ఇతర శరీర భాగాలకు తీవ్రంగా గాయాలైనట్టు సమాచారం. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు.. మరోవైపు చిరుత పులిని కూడా స్థానికంగా ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం ఆ పులికి అక్కడ వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
రోడ్డు దాటుతున్న చిరుతను డీకొట్టిన బైకర్
కర్ణాటక : రామానగర్ – మాగడి రోడ్డును దాటుతున్న చిరుతను చూసి, భయాందోళనకు గురై చిరుతను డీకొట్టిన బైకర్.
ప్రమాదంలో బైకర్‌కు కాలు విరగగా.. చిరుతకు పొట్ట, వెనుక కాళ్లకు గాయాలయ్యాయి. pic.twitter.com/8ai1SWYvBj
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2024