https://oktelugu.com/

Haryana : కుర్చీకింద బాంబు పెట్టి లేపేద్దామనుకున్నారు., చీటర్‌పై విద్యార్థుల దుశ్చర్య!

పాఠశాల దశ అనేది ప్రతీ విద్యార్థికి ఒక మెమరబుల్‌. ఆరోజులు ఎప్పటికీ తిరిగి రావు. అందుకే చాలా మంది నాటి రోజులను గుర్తు చేసుకునేందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరిట కలుసుకుంటున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 17, 2024 / 04:48 PM IST

    Haryana

    Follow us on

    Haryana : బాల్యం చాలా విలువైనది. తిరిగి రానిది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో పాఠశాల దశ చాలా ముఖ్యమైనది. పాఠశాల దశలో ఉన్నప్పుడు కష్టంగా భావిస్తారు. కానీ, తర్వాత బాధపడతారు. తిరిగి రాని దశను గుర్తు చేసుకునేందుకు నేటి తరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో సమావేశం అవుతున్నారు. అయితే పాఠశాల దశలో ఉన్న విద్యార్థులు విద్యార్థులపై కోపం ఉన్నా.. 1990కి ముందు భయం భక్తితో ఉండేవారు. అందుకే నాటి రోజులు మధుర జ్ఞాపకంగా మిగిలియాయి. నేటి తరం మాత్రం పెడదారి పడుతోంది. గురువులనే టార్గెట్‌ చేస్తోంది. తాజాగా హరియాణాలో విద్యార్థులు ఏకంగా టీచర్‌ కుర్చీ కిందనే బాంబు పెట్టి పేల్చారు. అదృష్టవశాత్తు టీచర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన విద్యార్థుల్లో పెరుగుతున్న క్రూరత్వానికి అద్దం పడుతోంది.

    ప్రమాదకరమైన చిలిపి చేష్ట..
    టీచర్‌ను ఏడిపించాలన్న లక్ష్యంతో 12వ తరగతి విద్యార్థులు సైన్స్‌ టీచర్‌ కుర్చీ కింద బాణసంచా లాంటి బాంబు పెట్టారు. టీచర్‌ వచ్చి కూర్చున్న తర్వాత దానిని పేల్చారు. అయితే టీచర్‌ క్షేమంగా బయట పడ్డారు. దీంతో ఈ ఘటనకు పాల్పడిన 12వ తరగతి విద్యార్థులను వారం పాటు పాఠశాల నుంచి సస్పెండ్‌ చేశారు. ఇక ఈ బాంబును యూట్యూబ్‌లో చూసి తయారు చేసినట్లు విద్యార్థులు తెలిపారు.

    టీచర్‌ మందలించిందని..
    సైన్స్‌ టీచర్‌ మందలించడంతో విద్యార్థులు టీచర్‌పై కోపం పెంచుకున్నారు. తమను బాధపెడుతున్న టీచర్‌ను ఎలాగైనా బాధపెట్టాలని అనుకున్నారు. దీంతో యూట్యూబ్‌ చూసి బాణాసంచా లాంటి బాంబు తయారు చేశారు. దానిని కుర్చీకింద పెట్టారు. టీచర్‌ వచ్చి కుర్చీలో కూర్చున్న తర్వాత రిమోట్‌ సహాయంతో దానిని పేల్చాడు. 13 మందిని సస్పెండ్‌ చేసిన పాఠశాల యజమాన్యం.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది.

    క్షమాపణలు కోరిన తల్లిదండ్రులు..
    టీచర్‌ కుర్చీ కింద బాబు పెట్టిన ఘటనలో పాఠశాల యాజమాన్యం 13 మందిని సస్పెండ్‌ చేసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను క్షమించాలని కోరుకున్నారు. ఇలాంటి పని ఇంకోసారి చేయకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా బాధిత టీచర్‌ కూడా విద్యార్థులను క్షమించినట్లు తెలిసింది.