Srivari Parakamani Money Theft Case: పరకామణి చోరీ కేసుకు సంబంధించి కీలక సాక్షి, గుంతకల్లు జిఆర్పి సీఐ సతీష్ కుమార్( Satish Kumar) మరణం మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసుకు సంబంధించి లోతైన విచారణ కొనసాగుతోంది. సతీష్ కుమార్ హత్య నేపథ్యంలో ఏపీ హైకోర్టు సైతం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ తో పాటు సాక్షులకు భద్రత కల్పించాలని ఏపీ పోలీసులను ఆదేశించింది. వైసిపి హయాంలో పరకామణి లో రవికుమార్ అనే టిటిడి ఉద్యోగి చోరీ చేయగా అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్న సతీష్ కుమార్ గుర్తించి పోలీసులకు అప్పగించారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా.. కొద్ది రోజులకే లోక్ అదాలత్ లో కేసు రాజు చేసుకున్నారు సతీష్ కుమార్. అయితే అప్పటి టీటీడీ పెద్దల ప్రోత్సాహంతోనే ఇలా చేశారని.. భారీగా అవకతవకలు ఉన్నాయని హైకోర్టులో ఓ జర్నలిస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు ఆదేశించింది కోర్టు. అయితే కేసు విచారణకు రెండోసారి హాజరయ్యేందుకు వస్తుండగా సతీష్ కుమార్ మృతి చెందారు. ఇది సంచలనంగా మారింది.
* చాలా అంశాల్లో దర్యాప్తు..
ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. కేసును తాడిపత్రి( Tadipatri) పోలీస్ స్టేషన్కు బదలాయించింది రైల్వే పోలీస్. సతీష్ కుమార్ చాతి భాగంలో ఎముకలు విరిగిపోవడం, శరీరంపై బలమైన గాయాలు ఉండడంతో ఇది హత్య? లేకుంటే ఆత్మహత్య అనేది పోలీసులు తేల్చలేకపోతున్నారు. విచారణలో భాగంగా సతీష్ కుమార్ బరువు ఉన్న బొమ్మలను రైలు నుంచి తోసి డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. తద్వారా సతీష్ ఆత్మహత్య చేసుకున్న.. లేక ప్రమాదవశాత్తు పడిపోయిన ఏ ఏ భాగాల్లో దెబ్బలు తగిలి అవకాశం ఉంది? ఎంత తీవ్రమైన గాయాలు తగిలే పరిస్థితి ఉంది అని విశ్లేషిస్తున్నారు.
* ఆసక్తికర అంశాలు..
ప్రస్తుతం కేసులో మిస్టరీని ఛేదించేందుకు 15 బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈనెల 13న విచారణకు హాజరయ్యేందుకు గుంతకల్లు( guntakallu ) రైల్వే స్టేషన్ లో రాయలసీమ ఎక్స్ప్రెస్ లో బయలుదేరారు సతీష్ కుమార్. అయితే బయలుదేరిన గంట వ్యవధిలోనే ఆయన మృతి చెందారు. అయితే అసలు ఆ గంట పాటు ఏం జరిగింది? రైలులో పాత నేరస్తులు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. అదే రైలు బోగీలో ప్రయాణిస్తున్న వారిని సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే రైలులో సతీష్ కుమార్ లగేజీ ఆయన అయితే రైలులో సతీష్ కుమార్ లగేజీ ఆయన రిజర్వ్ చేసుకున్న సీటు వద్ద కాకుండా వేరే దగ్గర ఉన్నట్లు రైల్వే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రయాణికుల జాబితాను చూస్తే 13 మంది పాత నేరస్తులు ప్రయాణించారని.. వారు వివిధ భోగిల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఓ ముగ్గురు అయితే సతీష్ కుమార్ ప్రయాణించిన కంపార్ట్మెంట్ లోనే ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు సతీష్ కుమార్ బోగీలో ఓ చోట రక్తపు మరకలు సైతం గుర్తించినట్లు సమాచారం. అయితే దాదాపు 15 దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగడంతో వీలైనంత త్వరగా ఈ కేసును చేదించే అవకాశం ఉంది.