Sonam Raghuvanshi Jail: “చిలకా ఏ తోడు లేక.. ఏటేపమ్మా ఒంటరి నడక.. తెలిసే అడిగేసినాక ఎడారంటి ఆశల వెనక” ఈ పాట అచ్చు గుద్దినట్టు ఈమెకు సరిపోతుంది. ప్రియుడి మోజులో పడిపోయి భర్తను కడ తేర్చింది. పెళ్లికి ముందు అతడితో సంబంధం ఉన్నప్పటికీ.. కుటుంబ సభ్యులు చెప్పినట్టే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అభం శుభం తెలియని భర్తను హనీమూన్ పేరుతో మేఘాలయ తీసుకెళ్లి.. అక్కడ అత్యంత నాటకీయమైన పరిస్థితుల మధ్య అతడిని అంతమొందించింది. దీనికోసం కిరాయి నేరగాళ్ల సహకారం తీసుకుంది.. ఈ దారుణానికి సంబంధించి ప్రణాళిక మొత్తం ప్రియుడితో కలిసి చేసింది. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.. ఇప్పుడు ఆమె, ప్రియుడు, కిరాయి నేరగాళ్లు జైల్లో ఉన్నారు..
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘ఓజీ’ స్లొగన్స్.. మండిపడ్డ పవన్!
మే నెల 20వ తేదీన ఇండోర్ జంట రాజా రఘువంశి, సోనం హనీమూన్ నిమిత్తం మేఘాలయ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే తన ప్రియుడి సహకారంతో సోనం రఘవంశీని అంతం చేసింది.. రఘు వంశి ని అంతం చేసిన తర్వాత అతడి మృత దేహం దాదాపు 11 రోజుల తర్వాత లభ్యమైంది. మేఘాలయలోని సోహ్ర ప్రాంతంలో లభ్యమైంది. అతడి శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయి. దీంతో పోలీసులు అతనిపై ఘోరం జరిగిందని అనుమానించారు. ఆ తర్వాత అతడి భార్య కోసం గాలించారు. ఆమె ఉత్తర ప్రదేశ్ ఘాజీ పూర్ లో కనిపించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఆమె నేరం చేసినట్టు ఒప్పుకుంది. ఆమె ఈ దారుణానికి పాల్పడేందుకు ప్రియుడు రాజ్ కుస్వాహా , మరో ఇద్దరు కిరాయి నేరగాళ్లు సహకరించారు. వారిని పోలీసులు ఘతనాన్ని 11న అరెస్ట్ చేసి కోర్టుకు పంపించారు. ఈ ఘటన అనంతరం మృతుడి కుటుంబానికి తాము అండగా ఉంటామని సోనం తరఫున బంధువులు చెప్పారు.
ప్రస్తుతం సోనం మేఘాలయలోని షిల్లాంగ్ జైల్లో ఉంది.. జైలు వార్డెన్ ఆఫీసుకు దగ్గరలో ఉన్న ఉగాదిలో ఆమెను ఉంచారు. అదే గదిలో సోనం తో పాటు మరో ఇద్దరు అండర్ ట్రయల్ ఖైదీలు కూడా ఉన్నారు. ఆమెను జైల్లో ఉంచి దాదాపు నెల రోజులు దాటిపోయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి పని అప్పగించలేదు. ఆమె కదలికలను సీసీ కెమెరాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. తోటి ఖైదీలతో సోనం ఇంతవరకు మాట కూడా మాట్లాడలేదు. తన గురించి గాని, చేసిన నేరం గురించి గాని ఇంతవరకు బయటికి చెప్పలేదు. ఆమెకు ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులు ఇంతవరకు చూసేందుకు రాలేదు. కనీసం ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఆసక్తిని చూపించడం లేదు..
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆమెతో తనకు ఎటువంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. అంతేకాదు ఆమెను అత్యంత దారుణంగా శిక్షించాలని పోలీసులను కోరారు.. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి.. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాట ప్రకారం వారు నడుచుకుంటున్నారు.. అయితే జైల్లో విచారణ ఖైదీగా ఉన్న సోనంలో కొంచెం కూడా పశ్చాత్తాపం కనిపించడం లేదని జైలు అధికారులు అంటున్నారు. ముభావంగా ఉంటున్నదని.. తప్పు చేశానని బాధ ఆమెలో ఏ మాత్రం కనిపించడం లేదని జైలు అధికారులు చెబుతున్నారు.