Shocking Crime In Visakhapatnam: “అవును సార్ చంపేశాను.. పీక నులిమి అంతం చేశాను. ఆ తర్వాత పతనైన ఆయుధంతో ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాను. నేరం నేనే ఒప్పుకుంటున్నాను. పైగా మీ ముందు లొంగిపోయాను. ఏం శిక్ష వేసుకుంటారు వేసుకోండి. నాకు ఆమె కోవిడ్ సమయంలో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం. మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. చాలా రోజులపాటు శారీరకంగా కలుసుకున్నాం. పెళ్లికూడా చేసుకోవాలనుకున్నాం.. భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయాం” ఇదీ వైజాగ్ లో మౌనిక అనే యువతని అంతం చేసి.. ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి.. ఉన్మాదిలాగా ప్రవర్తించిన రవీంద్ర పోలీసులతో చెప్పిన మాటలు.
కేసు దర్యాప్తులో భాగంగా.. రవీంద్రను తీసుకొని పోలీసులు మౌనికను చంపిన ప్రాంతానికి వచ్చారు. అక్కడ సీన్ కన్సెషన్ చేస్తుండగా రవీంద్ర దిగ్భ్రాంతి కలిగించే వాస్తవాలు చెప్పాడు. అతడు చెబుతున్న మాటలు పోలీసులకే వణుకు పుట్టించాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కోవిడ్ సమయంలో రవీంద్రకు.. మౌనికకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహానికి దారి తీసింది. అనంతరం ప్రేమగా మారింది. ప్రేమలో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఏకమయ్యారు. చాలా రోజులపాటు అలానే కలుసుకున్నారు. పెళ్లి చేసుకునే క్రమంలో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో దూరం పాటించారు. 2024లో రవీంద్ర వివాహం చేసుకున్నాడు. అతడికి ఒక పాప. భార్య పుట్టింటికి వెళ్లడంతో.. మౌనికకు రవీంద్ర ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు.. ఇతర వీడియోలను డిలీట్ చేయాలని సూచించాడు. ఇద్దరి మధ్య ఆ చర్చ సాగుతుండగానే మళ్లీ విభేదాలు వచ్చాయి.
మౌనిక రవీంద్ర మీద గట్టిగా అరవడంతో అతడు తట్టుకోలేకపోయాడు. సోఫాలో కి ఆమెను నెట్టేశాడు. బలవంతంగా పీక నొక్కాడు. శ్వాస ఆడక పోవడంతో మౌనిక కింద పడిపోయింది. పల్స్ ఉండడంతో మళ్ళీ పీకను గట్టిగా నొక్కాడు. ఈసారి ఊపిరి ఆడక ఆమె చనిపోయింది.. చనిపోయిన తర్వాత మౌనిక శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. దీనికోసం బయటికి వెళ్లి పదునైన ఆయుధాన్ని తీసుకొచ్చాడు.. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. అయితే మౌనిక శరీర భాగాలు దొరికినప్పటికీ.. తల లభించలేదు.
దీంతో పోలీసులు దర్యాప్తు కోసం అతడిని ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ మౌనిక బంధువులు ఉండడంతో రవీంద్ర మీద దాడి చేశారు. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఏమాత్రం భయం లేకుండా రవీంద్ర సమాధానం చెప్పడం విశేషం. దీంతో పోలీసు వర్గాలే అతని వ్యవహార శైలిని చూసి భయపడుతున్నారు. అతడు మనిషి కాదని.. రాక్షసుడి మాదిరిగా ఉన్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.