https://oktelugu.com/

Accident: అమెరికాలో ముగ్గురు హైదరాబాదీలను వెంటాడిన మృత్యువు.. విగత జీవులుగా మిగిల్చింది!

అగ్రరాజ్యం అమెరికాలో తెలుగువారి మరణ మృదంగం కొనసాగుతోంది. కారణం ఏదైనా.. ప్రతీనెల భారతీయులు మృత్యువాత పడుతున్నారు. విగత జీవులుగా భారత్‌కు తిరిగి వస్తున్నారు. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని ముగులుస్తున్నారు

Written By: Raj Shekar, Updated On : September 4, 2024 10:32 am

Accident

Follow us on

Accident: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికాలో అడుగు పెడుతున్న భారతీయుల్లో కొంతమంది అవి నెలరవేరకుండానే తనువు చాలిస్తున్నారు. కొందరు అక్కడి దాడుల్లో మరణిస్తుంటే.. మరికొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విహార యాత్రలకు వెళ్లి నీటమునిగిపోతున్నారు. భారతీయుల మరణ వార్త వినని నెల లేదంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉన్నత చదువుల కోసం, ఉపాధి కోసం, డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకునేందుకు చాలా మంది అమెరికాబాట పడుతున్నారు. కరోనా తర్వాత అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను అమెరికాకు పంపుతున్నారు. చదువులు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు సంపాదించుకుని స్థిర పడుతున్నారు. కొందరు ఉద్యోగులను కంపెనీలు అమెరికా పంపుతున్నాయి. అయితే అమెరికా వెళ్లిన కొందరు మృత్యువాత పడుతున్నారు. తాజాగా టెక్సస్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఇందులో ముగ్గురు హైదరాబాద్‌ వాసులు ఉన్నారు. మరో వ్యక్తి చెన్నైవాసి అని తెలిసింది.

వరుసగా ఐదు వాహనాలు ఢీకొని..
అగ్రరాజ్యం అమెరికాలో విషాదకర ఘటన జరిగింది. టెక్సస్‌లో రోడ్డుపై వెళ్తున్న 5 వాహనాలు ఒకేసారి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు దర్మరణం చెందారు. ఇందులో నలుగురు మృతిచెందగా, ముగ్గురు హైదరాబాద్‌కు తెలుగువారు. మృతుల పేర్లు రఘునాథ్, లోకేష్, ఫరూక్‌షేక్, మరో వ్యక్తి చెన్నైవాసి దర్శిని వాసుదేవన్‌ అని నిర్ధారణ అయ్యింది. తెలుగు మృతుల్లో ఒకరు కుకట్‌పల్లి వాసి ఉన్నట్టు సమాచారం.

ఆగస్టు 30న ఘటన..
టెక్సాస్‌ రాష్ట్రంలోని అన్నెలో శుక్రవారం (ఆగస్టు 30) మధ్యాహ్నం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బాధితులు కారులో బెంటన్‌విల్లే వైపు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలు ఒకేసారి ఢీకొట్టుకున్నాయి. దీంతో ఘోర ప్రమాదానికి దారి తీసింది. మంటలు కూడా చెలరేగాయాయి. యూఎస్‌ 75వ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రయాణించిన కారు మంటల్లోకి దూసుకెళ్లిందని, బాధితులు లోపల చిక్కుకున్నారని తెలిసింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయినట్టుగా తెలుస్తోంది.

తల్లడిల్లిన బాధిత కుటుంబాలు..
అమెరికా రోడ్డు ప్రమాదం విషయాన్ని అక్కడి అధికారులు మృతుల కుటుంబాలకు సమాచారంచారు. తమ వారి మరణ వార్త విన్న కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను త్వరాగా భారత్‌కు తరలించాలని బాధిత కుటుంబాలు భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.