Piduguralla
Piduguralla: మిర్చి వ్యాపారం( Mirchi business) చేసిన అతను బాగానే సంపాదించాడు. సమాజంలో పలుకుబడి సాధించాడు. ఈ క్రమంలో బంగారం వ్యాపారంలో అడుగుపెట్టాడు. తక్కువ ధరకే బంగారం అందిస్తానని చెప్పి డిపాజిట్లు సేకరించాడు. ఇప్పుడు ఏకంగా 100 కోట్ల రూపాయలతో ఉడాయించాడు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వెలుగు చూసింది ఈ ఘరానా మోసం. తాము మోసపోయామని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు బాధితులు. ఒకరు కాదు ఇద్దరు కాదు వందల కొద్ది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులు ఉన్నట్టు సమాచారం.
Also Read: అంతా అమృతనే చేసింది.. మా నాన్నకు ఎందుకీ శిక్ష? విలపించిన కూతురు
* మిర్చి వ్యాపారిగా సుపరిచితం పిడుగురాళ్లకు( Piduguralla ) చెందిన పెరుమాళ్ళ రాజేష్ మిర్చి వ్యాపారం చేస్తుండేవాడు. ఆ వ్యాపారంలోనే బాగా సంపాదించాడని ప్రచారంలో ఉంది. పేరు మోసిన వ్యాపారిగా గుర్తింపు సాధించిన రాజేష్ బంగారం వ్యాపారం లోకి దిగాడు. ఆరు నుంచి ఏడు లక్షలు ఇస్తే 100 గ్రాముల బిస్కెట్ బంగారం ఇస్తానని ప్రజలకు నమ్మబలిగాడు. బయట మార్కెట్లో బిస్కెట్ బంగారం 9 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. దీంతో రెండు నుంచి మూడు లక్షల రూపాయలు తక్కువగా ఉండడంతో ఎక్కువమంది ఆయన వద్ద డిపాజిట్ చేయడం ప్రారంభించారు.
* నమ్మకంతో వ్యాపారం..
ప్రారంభంలో ఎంతో నమ్మకంతో బిస్కెట్ బంగారం( gold biscuit) ఇచ్చి మరింత మందిని ఆకట్టుకున్నాడు రాజేష్. నిర్ణీత వ్యవధిలో బిస్కెట్ బంగారం ఇవ్వకుంటే అందుకు తగ్గట్టుగా వడ్డీతో సహా డబ్బులు చెల్లిస్తానని రాజేష్ చెప్పుకొచ్చాడు. దీంతో 100 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ల రూపంలో ఆయనకు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ బంగారం బిస్కెట్లు ఇవ్వడం నిలిచిపోయింది. దీంతో ఒక్కసారిగా బాధితులు ఆందోళనకు గురయ్యారు. అయితే రాజేష్ తో పాటు కుటుంబ సభ్యులు కనిపించకుండా మానేశారు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో మోసపోయామని భావిస్తున్నారు బాధితులు. అలాగని ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
* పెరుగుతున్న మోసాలు
ఇటీవల సమాజంలో మోసాలు పెరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలు( జరుగుతున్నాయి. అయినా సరే ప్రజల్లో మార్పులు రావడం లేదు. కనీసం ముక్కు ముఖం తెలియని వారు సైతం మోసాలకు దిగుతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అత్యాశను క్యాష్ చేసుకుంటున్నారు. కనీసం అదనపు సాయం, అదనపు వడ్డీ వంటి వాటి విషయంలో ఆలోచన చేయకుండానే ప్రజలు మోసాల బారిన పడుతున్నారు. ఇందులో ఉద్యోగులు కూడా బాధితులుగా మిగులుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: మారుతి రావు చనిపోయినప్పుడు బాధపడ్డా.. అమృత ప్రణయ్ కేసులో సంచలన విషయాలు పంచుకున్న హైడ్రా రంగనాథ్