Vajedu SI: వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న హరీష్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఏడుగురు మావోయిస్టు ఎన్ కౌంటర్ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగింది. దానిని మర్చిపోకముందే ఎస్సై సోమవారం తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. అయితే దీని వెనుక ఏం కారణాలు ఉన్నాయనేది ఇంతవరకు తెలియ రాలేదు. ఉదయం విధులకు వెళ్లడానికి రెడీ అవుతున్న హరీష్.. బెడ్ రూం లోకి వెళ్లి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. గదిలో గట్టి శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు ఉలిక్కిపడ్డారు. వెంటనే గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో హరీష్ కనిపించాడు.. గతంలో హరీష్ పేరూరు ఎస్సైగా పనిచేశారు. అక్కడ పని చేస్తున్నప్పుడు మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను చంపేశారు. ఈ ఘటన తర్వాత హరీష్ ను పోలీస్ అధికారులు వాజేడుకు బదిలీ చేశారు. ఈ వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆదివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం అటవీ పరిధిలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నప్పటికీ.. ఆ ప్రాంతం వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఎస్సై సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోవడం పోలీస్ శాఖలో కలకలం రేపింది. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉండే హరీష్ ఇలా ఆత్మహత్య చేసుకోడాన్ని సిబ్బంది జీర్ణించుకోలేకపోతున్నారు. విధి నిర్వహణలో ఎటువంటి ఒత్తిడి లేదని, ఉన్నతాధికారులు కూడా ఆయనతో ఫ్రెండ్లీగా ఉంటారని.. కుటుంబ పరంగా సమస్యలు కూడా లేవని.. అలాంటప్పుడు హరీష్ ఆత్మహత్య చేసుకోవడం తట్టుకోలేకపోతున్నామని సిబ్బంది కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆదివారం ఎన్ కౌంటర్
హరీష్ ఎస్ఐగా పనిచేస్తున్న వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఆదివారం తెల్లవారుజామున భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు ఈ ఎన్ కౌంటర్ లో దుర్మరణం పాలయ్యారు. తెల్లవారుజామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. కేంద్ర బలగాలు, గ్రేహౌండ్స్ దళాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు.. అయితే ఇటీవల కాలంలో వరుసగా మావోయిస్టులు ఎన్ కౌంటర్ లలో బలి అవుతున్నారు. అయితే ఈ ఎన్ బూటకమని.. మావోయిస్టులకు తినే ఆహారంలో విషం కలిపి చంపేశారని పోలీసులపై మానవహక్కుల సంఘం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మీడియాకు ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఇది సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. ఎన్ కౌంటర్ పై విచారణ నిర్వహించాలని.. నిజాలను వెలుగులోకి తేవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అది బూటకపు ఎన్ కౌంటర్ కాబట్టి ఎస్ఐ హరీష్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని వారు వివరిస్తున్నారు. కాగా, ఎస్సై సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని చనిపోవడం పట్ల పోలీస్ శాఖలో కలకలం నెలకొంది.
ఈనెల 14న ఎంగేజ్మెంట్
హరీష్ కు ఇటీవల ఓ అమ్మాయితో వివాహం కుదిరింది. ఈనెల 14న నిర్వహించే ఎంగేజ్మెంట్ కు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఎంగేజ్మెంట్ కు సంబంధించి షాపింగ్ చేయాలని హరీష్ ఇటీవల సిబ్బందితో చెప్పాడు. కానీ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం బాధ కలిగిస్తోందని వాజేడు పోలీస్ స్టేషన్ సిబ్బంది చెబుతున్నారు.
ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీష్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఈ PS పరిధిలోనే ఏడుగురు మావోల ఎన్ కౌంటర్ జరిగింది. హరీష్ పేరూరు ఎస్ఐ గా ఉన్నప్పుడు ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనులను మావోలు చంపేశారు. అక్కడి నుంచి హరీష్ బదిలీపై వాజేడు వచ్చాడు. pic.twitter.com/5hQB2A6R4Q
— Anabothula Bhaskar (@AnabothulaB) December 2, 2024