China Mother: ఇటీవల కాలంలో మనదేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే అంతిమంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. ఇలా చైనా దేశానికి చెందిన ఓ వివాహిత తన భర్తను సాధించడానికి.. ఈ భూ ప్రపంచంలో ఏ మహిళ చేయని దారుణానికి ప్రవర్తించింది. 23వ అంతస్తులు పిల్లలను ఉంచి.. భయభ్రాంతులకు గురిచేసింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఓ మహిళ తన భర్తతో తరచూ గొడవపడుతోంది. ఈ క్రమంలో అతడిని ఇబ్బంది పెట్టడానికి తన పిల్లల్ని 23వ అంతస్తు పైకి తీసుకెళ్లింది. అక్కడ బయట ఏర్పాటు చేసిన ఏసీ పై కూర్చోబెట్టింది. అంత పై నుంచి పిల్లల్ని కింద పడేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యం సామాజిక మాధ్యమాలలో చర్చకు దారితీస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. ఆమె తల్లి కాదు, రాక్షసి అని విమర్శిస్తున్నారు.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం..
అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. దక్షిణచైన మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం హెనాన్ ప్రావిన్స్ లోని లుయోయాంగ్ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం ఇద్దరు పిల్లలు అపార్ట్మెంట్ వెనుక ఉన్న ఏసీ యూనిట్ పై కూర్చుని ఉన్నారు. దానిపై నుంచి వేలాడుతూ కల్పించారు. ఆ దృశ్యాన్ని చూసి స్థానికంగా ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పిల్లల పక్కన ఉన్న కిటికీలో వారి తల్లి కూర్చుంది. భర్తపై కేకలు వేస్తోంది. అతడిని కొట్టాలని చూస్తోంది. అయితే ఆ పిల్లలను కాపాడేందుకు ఆ భర్త కిటికీ వైపు వచ్చాడు. అయితే అతడు రాకుండా ఆ మహిళ నిలువరించడం ప్రారంభించింది. అంతేకాదు తన భర్తతో గొడవ పడడం మొదలుపెట్టింది. చైనీస్ భాషలో అతడిని ఏదో బూతులు తిడుతోంది. నోటికి ఏమాత్రం విరామం ఇవ్వకుండా ఆమె అరుస్తూనే ఉంది. ఆమె అంతలా అరుస్తున్నప్పటికీ భర్త మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు. తన పిల్లల్ని లోపలికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని ప్రయత్నాన్ని ఆమె పలుమార్లు అడ్డుకుంది. ఈ నేపథ్యంలో పక్కనున్నవారు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి ఆ పిల్లల్ని కాపాడారు. అయితే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. ఈమె తల్లి కాదు రాక్షసి అంటూ విమర్శిస్తున్నారు. “23వ అంతస్తులో పిల్లల్ని కూర్చోబెట్టింది. ఏసి బోర్డుపై నుంచి కింద పడితే వారి పరిస్థితి ఏమిటి? భర్తతో గొడవ పడితే.. ప్రతీకారం పిల్లలపై తీర్చుకోవడమేంటని” నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.
Mum in China leaves kids outside 23rd floor window to annoy husband
The China Women and Children’s Federation said it was looking into the matter pic.twitter.com/h8NtrNkTSg
— MustShareNews (@MustShareNews) October 17, 2024