Homeక్రైమ్‌Madhapur OYO Room Incident: చొంగ కార్చుకుంటూ ఓయో రూమ్ కి వెళ్ళాడు.. ఆ తర్వాత...

Madhapur OYO Room Incident: చొంగ కార్చుకుంటూ ఓయో రూమ్ కి వెళ్ళాడు.. ఆ తర్వాత ఈ డాక్టర్ కు ఎటువంటి అనుభవం ఎదురైందంటే?

Madhapur OYO Room Incident: నేటి కాలంలో ఓయో రూములకు యువతీ యువకులు మాత్రమే కాదు.. పేరుపొందిన వ్యక్తులు కూడా వెళ్తున్నారు. అటువంటి వ్యక్తులకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయో తెలియదు కానీ.. ఓ వైద్యుడికి మాత్రం దిమ్మ తిరిగిపోయే అనుభవం ఎదురయింది. అంతేకాదు అతని వృత్తి గత జీవితం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అతడు తల పట్టుకున్నాడు. ఏం చేయాలో తెలియక తలవంచుకున్నాడు.

మాదాపూర్ ప్రాంతంలో ఓ వైద్యుడు పనిచేస్తున్నాడు. అతడు ఇటీవల ఓ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. దాని ద్వారా ఓ యువకుడు అతనికి పరిచయం అయ్యాడు. ఇద్దరు నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. పరస్పరం చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఓయో రూం ను బుక్ చేసుకున్నారు. ఇద్దరు తొలిసారి కలవడంతో ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఆ యువకుడు ఆ వైద్యుడి మీద అత్యాచారానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపరిచాడు..

అంతటితోనే ఆ యువకుడు ఆగలేదు. ఆ వైద్యుడిని ఫోన్లో బెదిరించాడు. దీంతో తట్టుకోలేక ఆ వైద్యుడు అతడికి ఫోన్ పే ద్వారా ఐదు వేలు పంపించాడు. ఆ తర్వాత ఆ యువకుడు ఆ వైద్యుడు పనిచేస్తున్న ఆసుపత్రి వద్దకు వెళ్లాడు. అక్కడ పెద్ద గొడవ చేసాడు. తనను ప్రైవేట్ గా కలిసిన విషయం కుటుంబ సభ్యులతో చెప్తానని హెచ్చరించాడు. దీంతో ఆ వైద్యుడు తట్టుకోలేక మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పాడు.

పేరుపొందిన వైద్యుడు అయినప్పటికీ అతని పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడమేంటి.. ఓ యాప్ ద్వారా యువకుడికి దగ్గర కావడం ఏంటి.. అతడిని అత్యంత రహస్యంగా కలవడం ఏంటి.. ఈ విషయాన్ని అత్యంత గోప్యం గా ఉంచడం ఏంటి.. అనే విషయాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా వైద్యుడు కుటుంబ సభ్యులను పిలిచారు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో యాప్స్ ద్వారా పరిచయాలు పెంచుకొని.. అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం పెరిగిపోయిందని పోలీసులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version