Kosgi Gold Trader Case: ఆయన పేరుపొందిన గోల్డ్ వ్యాపారి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కోస్గి ప్రాంతంలో ఆయనకు విశేషమైన పేరు ఉంది. అతడి ఇంట్లో ఓ 20 సంవత్సరాల యువతి పనికి కుదిరింది. ఉన్నట్టుంది ఒకరోజు వాంతులు చేసుకుంది. గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యుడు ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చి చెప్పాడు.
ఆరా తీయగా..
కోస్గి ప్రాంతంలో గోల్డ్ వ్యాపారి ఇంట్లో ఆ యువతి పనిచేస్తోంది. ఆ వ్యాపారి కుమారుడి పేరు సాయి కృష్ణ. ఇతడు ఆ 20 సంవత్సరాల యువతీతో ప్రేమ వ్యవహారం మొదలుపెట్టాడు. అంతేకాదు తరచు ఆమెతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఆమె వద్దని చెప్పినప్పటికీ బలవంత పెట్టాడు. ఇప్పుడు ఆదిమతి మూడు నెలల గర్భవతి. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు బంగారం వ్యాపారి కుటుంబ సభ్యులను నిలదీశారు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మంతనాలు మొదలుపెట్టారు. ఆ యువతి శీలానికి వెల కట్టడానికి ప్రయత్నించారు. అయితే ఆ యువతి ఏమాత్రం ఒప్పుకోలేదు.. సాయి కృష్ణ ప్రేమిస్తున్నానని చెప్పాడని.. శారీరకంగా నన్ను లొంగదీసుకున్నాడని.. ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదని ఆ యువతి పెద్దమనుషుల ముందు చెప్పేసింది.
అక్కడితోనే ఆ యువతి ఆగలేదు.. వెంటనే పోలీస్ స్టేషన్ వెళ్లిపోయింది. అక్కడ సాయి కృష్ణ మీద ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతో దూషించాడని యువతి పోలీసులకు చెప్పింది. దీంతో సాయి కృష్ణ తండ్రి.. కొంతమంది పెద్ద మనుషులతో పోలీస్ స్టేషన్ వెళ్లారు. అక్కడ తాము మాట్లాడుకుంటామని చెప్పడంతో పోలీసులు కూడా వదిలిపెట్టారు.. మరోవైపు ఆ యువతి పోలీసుల మీద ఒత్తిడి తీసుకురావడంతో సాయి కృష్ణ మీద అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఆ యువతి మూడు నెలల గర్భవతి అని తెలిసిన నేపథ్యంలో.. పోలీసులు ఆమెను నారాయణపేట జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు స్పష్టం చేశారు. మరోవైపు అట్రాసిటీ కేసు నమోదు అనే పద్యంలో సోమవారం డిఎస్పి లింగయ్య విచారణ మొదలుపెట్టారు.. గోల్డ్ వ్యాపారి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులను కూడా విచారించారు. కీలకమైన వివరాలు సేకరించారు. సాయి కృష్ణ వ్యవహార శైలిపై చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నివేదికను ఎస్పీకి అందజేస్తామని డిఎస్పీ వెల్లడించారు.
