Ketan Agarwal Case: పూణే వ్యాపారి కేతన్ ను అతనికి కాబోయే భార్య సియా హత్య చేసిన విషయం తెలిసిందే. దీనికోసం ఆమె తన ప్రియుడు చేతన్ సహాయం తీసుకుంది. చేతన్, సియా చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. చేతన్ క్రికెటర్ కూడా. అతడు ఆడ క్రికెట్ మ్యాచ్లకు సియా హాజరయ్యేది.. ఎప్పుడైతే కేతన్ తో ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుందో.. అప్పటినుంచి చేతన్ ఆమె మీద ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు.. దీంతో చేతన్ తో కలిసి సియా ప్రణాళిక రూపొందించింది. అతడిని అంతం చేయాలని డిసైడ్ అయింది.
గడిచిన మే నెల నుంచి జూన్ 14 వరకు రెండు పర్యాయాలు అతని మీద హత్యాయత్నం చేసింది. కాకపోతే అవి రెండు విఫలమయ్యాయి. జూన్ 18న చేసిన ప్రయోగం మాత్రం విజయవంతమైంది. జూన్ 18న అతడిని లోయలో నుంచి నెట్టివేయడంతో కేతన్ చనిపోయాడు. ఆ తర్వాత సియా మాటలు వేరే విధంగా ఉండడంతో.. అనుమానం వచ్చిన కేతన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అనేక రకాలుగా ఆధారాలు సేకరించి.. సియాను అరెస్ట్ చేశారు. ఆమె ప్రియుడు చేతన్ ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
విచారణలో సియా అనేక విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది..” కేతన్ కు బట్టతల ఉంటుంది. అతడు విగ్గు పెట్టుకుంటాడు. అందువల్లే అతడు మీద ఇష్టం పోయింది.. వాస్తవానికి అతడిది ధనవంతులైన కుటుంబం. కానీ నేను చేతన్ తో రిలేషన్ లో ఉన్నాను. కుటుంబ సభ్యులు అడిగితే కేతన్ తో పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ ప్రేమికుడి నుంచి ఒత్తిడి ఉండడంతో ఏం చేయాలో తెలియలేదు. అందువల్లే ఇది చేయాల్సి వచ్చిందని” ఆమె పోలీసులతో చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది..
మరోవైపు సియా తల్లిదండ్రులు ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. అతడికి బట్ట తల ఉందనే విషయం తన కూతురికి తెలుసని వారు చెబుతున్నారు.. అయినప్పటికీ ఆమె పెళ్లికి ఒప్పుకుందని.. ఎన్నడు కూడా చేతన్ ప్రస్తావన ఇంట్లో తేలేదని.. కనీసం అతడితో మాట్లాడినట్టు కూడా కనిపించలేదని వారు చెబుతున్నారు. మొత్తానికి ఈ కేసు ఎక్కడి నుంచో మొదలై.. చివరికి ఇక్కడ ముగిసింది.
