Karnataka Crime Case: ఆమె పేరు శ్వేత. కర్ణాటకలోని హసన్ జిల్లా ఆమె సొంత ప్రాంతం. గతంలోనే ఆమెకు వివాహం జరిగింది. భర్తతో విభేదాల వల్ల విడాకులు తీసుకుంది. హసన్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. చూసేందుకు శ్వేత అందంగా ఉంటుంది. ఎత్తు, దానికి తగ్గట్టుగా శరీర సౌష్టవంతో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి శ్వేత విగతురాలుగా మారిపోయింది. నిన్నటిదాకా చలాకీగా ఉంటూ.. ఆఫీసులో అందరితో కలివిడిగా ఉన్న శ్వేత చనిపోవడాన్ని తోటి ఉద్యోగులు తట్టుకోలేకపోయారు.
శ్వేత మరణం పట్ల వారు అనుమానం వ్యక్తం చేశారు. వారు వ్యక్తం చేసిన అనుమానమే నిజమైంది. శ్వేత పనిచేస్తున్న ఆఫీస్ లోనే రవి అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. అతడికి గతంలోనే వివాహం జరిగింది. భార్య కూడా ఉంది. శ్వేత చూసేందుకు అందంగా ఉండడంతో ఆమెతో మాటలు కలిపాడు. తోటి ఉద్యోగి కావడంతో ఆమె కూడా మాట్లాడింది. ఆ మాటలు కాస్త స్నేహంగా మారాయి. శ్వేత కూడా అతడిని ఒక స్నేహితుడి లాగానే చూసింది. అయితే రవిలో ఉన్న మరో కోణాన్ని ఆమె పసిగట్టలేకపోయింది. మెల్లిమెల్లిగా ఆమెకు అతడు దగ్గర కావడం మొదలుపెట్టాడు.. రవికి వివాహం జరిగిన విషయం శ్వేతకు తెలుసు. అయితే శ్వేత భర్త విడి పోయి దూరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఆమెను గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని రవి ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇటీవల కాలంలో ఆమె ముందు ఒక ప్రతిపాదన కూడా ఉంచాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. పైగా ఇటువంటి వ్యవహారాలు తనకు సరిపడవని చెప్పింది. తను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్టు వెల్లడించింది. తన ప్రతిపాదనను శ్వేత ఒప్పుకోకపోవడంతో రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read: కోతి చేసిన ఆ చిన్న పని.. ఏకంగా 30 మంది ఆసుపత్రికి..!
అప్పటినుంచి అతనితో ఆమె మాట్లాడటం మానేసింది. అయితే ఇటీవల కాలంలో రవి మళ్ళీ ఆమెతో మాట్లాడటం మొదలు పెట్టాడు. స్నేహితులుగా ఉందామని చెప్పాడు. దీంతో ఆమె ఒప్పుకుంది. సోమవారం ఆఫీస్ లోనే శ్వేతతో మాట్లాడిన రవి.. సరదాగా కాఫీ తాగుదామని చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకుంది. ఆమెను కారులో ఎక్కించుకొని దూరంగా వెళ్ళాడు రవి. ఇప్పటికీ ఆమె కారులో ఉండి అరుస్తూనే ఉంది. అయినప్పటికీ రవి వినిపించుకోలేదు.. నేరుగా శ్వేతను కారులో చందనహళ్లి అనే సరస్సులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తనకు గర్ల్ ఫ్రెండ్ గా ఉండాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను సరస్సులోకి తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు ఈదుకుంటూ బయటికి వచ్చాడు. పోలీసులు శ్వేత ఫోన్ కాల్స్.. ఆఫీస్ సిసి కెమెరాలు మొత్తం పరిశీలించారు. అందులో రవి కారులో శ్వేత ఎక్కిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఈ ఘటనకు రవి బాధ్యుడని ప్రాథమికంగా ఒక అంగీకారానికి వచ్చారు. చందనహళ్లి సరస్సులో శ్వేత హృదయము ఉండడంతో పోలీసులు పడవల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. రవిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.