Crime : జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబందించి బలవంతంగా షేర్ల బదలాయింపు, యాజమాన్య మార్పిడి కేసులో ట్విస్టులమీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. సంచలన వ్యక్తులు పేర్లు బయటపడుతున్నాయి. ఈ కేసులో తాజాగా ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆయన ఉన్నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు.
ఎన్ఆర్ఐ ఫిర్యాదు…
ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌తోపాటు పలువురిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ, వ్యాపార వేత్త చెన్నుపాటి వేణుమాధవ్ జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించాడు. ట్యాపింగ్ కేసులో ఉన్న పలువురు నిందితులు తనను గతంలో కిడ్నాప్ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాధాకిషన్ రావు, గట్టుమల్లు, మల్లికార్జున్ తోపాటు కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ, చంద్రశేఖర్ వేగే సహ మరికొందరిపై కేసు నమోదు చేశారు.
కంపెనీ డైరెక్టర్లపై కూడా..
ఇక ఈ వ్యవహారంతో పోలీసులతోపాటు ఈ సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు లబ్ధి చేకూరినట్లు వేణిమాధవ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావును తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు.
విచారణకు సిద్ధం..
పోలీసులు, కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన పోలీసులు ముందుగా డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చి విచారణ చేసేందుకు సిద్ధమవుతున్నారు. వేణుమాధవ్, చంద్రశేఖర్ వేగేల మధ్య ఆర్థికపరమైన విభేదాలతో ఇరువురిపై కేసులు నమోదై ఉన్నాయి. చంద్రశేఖర్‌పై గతంలో పీడీ చట్టాన్ని సైతం ప్రయోగించగా విచారణ క్రమంలో దానిని అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: In the kidnapping case expatriate indian celebrities mythri movie makers head naveen yarneni
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com