Homeక్రైమ్‌Gas Booking: భార్యను కడ తేర్చాడు.. దర్జాగా తప్పించుకున్నాడు.. చివరికి ఇలా దొరికిపోయాడు

Gas Booking: భార్యను కడ తేర్చాడు.. దర్జాగా తప్పించుకున్నాడు.. చివరికి ఇలా దొరికిపోయాడు

Gas Booking: తప్పు చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదు. అన్యాయానికి పాల్పడిన వాడు చివరికి చట్టం ముందు తలవంచక తప్పదు. న్యాయం జరగడం కాస్త ఆలస్యం కావచ్చు. కానీ ఏనాటికైనా అన్యాయం మీద గెలిచేది న్యాయమే. అధర్మం మీద నిలబడేది ధర్మమే. సినిమాలలోనే కాదు.. నిజ జీవితంలోనూ తప్పులు చేసిన వారు.. వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే.. అటువంటిదే ఈ ఘటన.

అతని పేరు సందీప్ తోమర్. ఆర్మీలో ఒకప్పుడు కెప్టెన్ గా పనిచేశాడు. ఇతడికి వివాహం జరిగింది. భార్యను ప్రతిక్షణం అనుమానిస్తూ ఉండేవాడు. ఆమె ఫోన్ కాల్స్.. కదలికలను అనుక్షణం గమనిస్తుండేవాడు. తన భర్త తీరుతో ఆమె విసిగిపోయింది. అయినప్పటికీ సందీప్ ఆమెను వదిలిపెట్టలేదు. పలుమార్లు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. సందీప్ తన భార్య తల్లిదండ్రులకు నచ్చ చెప్పి తీసుకెళ్లేవాడు. అనేక పర్యాయాలు జరిగింది. చివరికి సందీప్ 2013 సంవత్సరంలో తన భార్య మీద మరింత అనుమానాన్ని పెంచుకొని దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటన తర్వాత పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అనేక ఆధారాలు సేకరించారు. సందీప్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో అతడిని ప్రొడ్యూస్ చేశారు. పోలీసులు సమర్పించిన ఆధారాలతో ఏకీభవించిన కోర్టు అతడికి 2014లో జీవిత ఖైదు విధించింది. 2019లో అతడికి బెయిల్ లభించింది. దీంతో సందీప్ బయటికి వచ్చాడు. అతడు తనకు జీవిత ఖైదును విధించడానికి సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లాడు. అయితే కోర్టు అతడి దరఖాస్తును 2022లో కొట్టి వేసింది. అయినప్పటికీ అతడు లొంగిపోలేదు. అనేక పర్యాయాలు తన గుర్తింపును మార్చేశాడు. లొకేషన్లు మార్చేశాడు.

అయితే ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో.. సిలిండర్ బుక్ చేసుకోవడానికి తన ఒరిజినల్ ఐడి వాడాడు. ఇన్ని రోజులపాటు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న సందీప్.. గ్యాస్ బుకింగ్ ఐడి ద్వారా దొరికిపోయాడు. అతడు బుక్ చేసిన ఐడి ఉన్న ప్రదేశానికి పోలీసులు వెళ్లారు. పోలీసులను చూసి పారిపోవడానికి సందీప్ ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతడిని చుట్టుముట్టి పట్టుకున్నారు. ఇన్ని రోజులపాటు పోలీసుల కళ్ళు కప్పి తిరిగిన సందీప్.. చివరికి గ్యాస్ బుకింగ్ ఐడి తో దొరికిపోయాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular