Female constable: సమాజంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. పోలీస్ ఉద్యోగం చేసేవారు శారీరకంగా, మానసికంగా సామర్థ్యంతో ఉంటారు. నేరాలకు పాల్పడే వ్యక్తులను కటకటాల వెనక్కి పంపించడానికి పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాలలో అత్యంత కఠినంగా ఉంటారు.. అయితే అటువంటి పోలీసులు కూడా కొన్ని సందర్భాలలో మానసిక ధైర్యాన్ని కోల్పోతారు. చివరికి బలవన్మరణానికి పాల్పడేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో ఓ పోలీసు స్టేషన్లో సంచలనం చోటుచేసుకుంది. తట్టుకోలేక ఎస్ఐ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దాన్ని మర్చిపోకముందే ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉంది. గుడుంబాను అరికట్టి.. మద్యం షాపుల నిర్వాహకుల దందాకు అడ్డుకట్ట వేసి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేయడం వీరి పని. అయితే కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్న ఓ మహిళ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పైగా తోటి సిబ్బందిపై ఆమె వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఆమె వేధింపులు తట్టుకోలేక గతంలో ఒక ఎస్సై ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఆ తర్వాత శాఖపరమైన విచారణ జరిగిన తర్వాత ఆ ఎస్సైని అక్కడి నుంచి పంపించారు. ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తోంది.. అయితే ఆమె కూడా ఆత్మహత్యకు ప్రయత్నించింది.. ఇది కాస్త మరోసారి ఆ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ను వార్తల్లో నిలిపింది.
ఆ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీంతో కొత్తగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారు చేస్తున్న ఆందోళనకు పురుష, మహిళా కానిస్టేబుళ్లు మద్దతు తెలిపారు. ఇందులో ఒక ఎస్ఐ కూడా ఉన్నాడు. ఈ వ్యవహారాన్ని సదరు మహిళా సిఐ కొట్టి పారేశారు. ఇదంతా ఒక డ్రామా అని పేర్కొన్నారు. తనపై ఇలా లేనిపోని నిందలు వేస్తే తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఆ సీఐ బెదిరించారు. మరోవైపు స్టేషన్లో సిబ్బంది మధ్య సీఐ గొడవలు పెట్టిస్తోందని.. excise superintendent కు కానిస్టేబుళ్లు వినతిపత్రం అందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని superintendent పేర్కొన్నారు.
కొత్తగూడెం ఎక్సైజ్ సీఐ వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
ఈ సీఐ వేధింపులకు గతంలో ఎస్ఐ కూడా ఆత్మహత్యాయత్నం
కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిన మహిళా కానిస్టేబుల్
కొత్తగూడెం ఎక్సైజ్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన మహిళా కానిస్టేబుల్… pic.twitter.com/Kea7J3U6ZV
— Telugu Scribe (@TeluguScribe) November 5, 2025