Extramarital affair: అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని.. పెద్దల సమక్షంలో వైవాహిక బంధం లో అడుగుపెట్టి.. పిల్లల్ని కని.. తమ సంతతిని వృద్ధి చేసుకోవాలి. దీనినే దాంపత్య జీవితం అంటారు. కష్టాల్లో సుఖాల్లో భార్యాభర్తలు ఒకరికి ఒకరై తోడుగా ఉండాలి. కానీ, నేటి కాలంలో వైవాహిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. దీనంతటికి ప్రధాన కారణం భార్యాభర్తల మధ్య సానుకూలమైన వాతావరణం లేకపోవడమే.
భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో.. వివాహేతర సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ సంబంధాలు దారుణమైన ఘటనలకు కారణమవుతున్నాయి. తద్వారా కుటుంబ వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య.. భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలు కొనసాగించడం వల్ల కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి. కొన్ని సందర్భాలలో ఈ అనైతికమైన బంధాలు దారుణమైన ఘటనలకు కారణమవుతున్నాయి. అటువంటి ఘటనలు ఇటీవల కాలంలో మనదేశంలో పెరిగిపోయాయి.
తమిళనాడు రాష్ట్రంలో కడలూరు జిల్లాలో ఓ మహిళ వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధం కాస్త ఆమె మామకు తెలిసింది. దీంతో అతడు ఆమెను నిలదీశాడు. ఇది సరైన పద్ధతి కాదంటూ ప్రశ్నించాడు. ఇలా చేస్తే కుటుంబం పరువు మొత్తం పోతుందని హెచ్చరించాడు.
తన ప్రియుడితో సాగిస్తున్న సంబంధానికి మామ అడ్డుగా ఉండడంతో ఆ కోడలు సహించలేకపోయింది. ఇదే విషయాన్ని ప్రియుడితో చర్చించింది. ఆ తర్వాత మామను చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం ప్రియుడి సహకారం తీసుకుంది. తన మామ ద్విచక్ర వాహనం మీద వెళుతుండగా ప్రియుడి సహకారంతో పెట్రోల్ పోసింది.. అంతేకాదు వెంటనే నిప్పు అంటించింది. పెట్రోల్ వల్ల మంటలు వెంటనే అంటుకొని అతని శరీరం మొత్తం కాలిపోయింది. సుమారు 70% శరీరం కాలిపోయింది. ఆ మంటల తాకిడికి అతడు తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. బైక్ నడపలేక కొంత దూరం అలానే నడుచుకుంటూ వచ్చాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ఆ వీడియో చూస్తుంటే భయం వేస్తోంది. దీనిపై ఫిర్యాదు అందుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే బాధితుడి కోడలు, ఆమె ప్రియుడు, ఇంకా నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు తమిళనాడు మీడియాలో వార్తలు వస్తున్నాయి.