Bike taxi driver account money: అతడు పొట్టకూటి కోసం బైక్ టాక్సీ నడుపుతుంటాడు. ప్రతిరోజు బైక్ నడపడం ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని సాకుతుంటాడు. అటువంటి వ్యక్తి ఇంటికి ఉన్నట్టుండి ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు వచ్చారు. సోదాలు మొదలుపెట్టారు. వారి సోదాలలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై కేంద్రం ఉక్కు పాదం మోపింది. ఏకంగా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాలను రూపొందించింది. అంతేకాదు ప్రజల నుంచి అక్రమంగా ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన పలు సంస్థల నిర్వాకాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ బయటపెడుతోంది. 1 ఎక్స్ బెట్ అనే సంస్థ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి చాలామంది దగ్గర్నుంచి డబ్బులు వసూలు చేసింది.. ఈ కేసును ప్రస్తుతం ఈడి విచారిస్తోంది. ఇందులో భాగంగా ఓ డ్రైవర్ ఖాతాలో 2024 ఆగస్టు 19 నుంచి 2025 ఏప్రిల్ 16 వరకు 331 కోట్లు డిపాజిట్ అయినట్టు అధికారులు గుర్తించారు.
ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న చిరునామాకు వెళ్లి అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఆ చిరునామా ఉన్న వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్. ఢిల్లీలో ఓ మురికివాడలో రెండు గదుల ఇంట్లో నివసిస్తున్నాడు. కాదు ఇతడి ఖాతా నుంచి రాజస్థాన్లోని ఉదయపూర్ ప్రాంతంలో జరిగిన ఓ వివాహ వేడుకకు కోటి రూపాయల వరకు చెల్లించాడు. ఆ వివాహం గుజరాత్ రాష్ట్రానికి చెందిన యువ రాజకీయ నాయకుడికి సంబంధించింది కావడం విశేషం. మరోవైపు తన బ్యాంకు ఖాతా ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్టు తెలియదని డ్రైవర్ చెప్పడం విశేషం. మరోవైపు బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఈ వ్యక్తి బ్యాంకు ఖాతాను మ్యూల్ అకౌంట్ గా వాడుకున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక నేరాల ద్వారా ప్రజల నుంచి అడ్డగోలుగా వసూలు చేసిన డబ్బులను ఇలాంటి మ్యూల్ ఖాతాల లో దాచుకొని.. వేరే వ్యక్తులకు పంపిస్తున్నారు.
ఈ కేసులో ఇంకా చాలామందికి ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉందని కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు చేరుతున్నారు. ఈ కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు జరపాలిసి ఉందని అధికారులు అంటున్నారు. ఈ కేసు లో కొన్ని వందల కోట్లు ఇలాగే మ్యూల్ ఖాతాలలో భద్రపరిచారని తెలుస్తోంది. ఆ డబ్బులను మొత్తం వెలికి తీసి ఫ్రీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.