Cyber fraud: కొన్నేళ్లుగా దేశంలో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. వీటి నియంత్రణకు పోలీసులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినా నేరాలు మాత్రం ఆగడం లేదు. చదువు రానివారి నుంచి ఉన్నత విద్యా వంతులు, ఐటీ ఫ్రొఫెషనల్స్ చివరకు బ్యాంకు ఉద్యోగులు కూడా సైబర్ మోసాలకు గురవుతున్నారు. దొంగలు కూడా టెక్నాలజీపై పట్టు సాధించి మోసాల్లో కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. మిడిల్ క్లాస్, సంసన్నులను బురిడీ కొట్టిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు ఉద్యోగులు, ఐటీ ఫ్రొఫెషనల్స్ కూడా నేరాలబారిన పడుతున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం మోసానికి తెరలేపారు. మీ పిల్లలకు యాక్సిడెంట్ అయిందని ఫోన్‌చేస్తున్నారు. ఆస్పత్రుల ఖర్చులకు వెంటనే డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నారు.
టెక్నాలజీ ఆధారంగా..
పెరుగుతున్న టెన్నాలజీతో సైబర్ నేరగాళ్లు కూడా తెలివి మీరుతున్నారు. టెన్నాలజీని ఆధారంగా చేసుకుని సరికొత్త పద్ధతిలో మోసాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా నేరగాళ్లు అనుసరిస్తున్న కొత్త విధానాలతో చిత్తవుతున్నారు. కొత్త తరహా మోసాలపై అవగాహన కల్పించేందుకు తాజాగా ఎక్సలో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో ఆసక్తికరమైన విషయం పోస్టు చేశారు. కొత్త తరహా సైబర్ మోసం, జాగ్రత్త అంటూ సజ్జనార్ హెచ్చరించారు.
వీడియోలో ఇలా..
మీ పిల్లలు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు అని తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నారు. హాస్పిటల్‌లో చేర్పించామని ఎమర్జెన్సీ వారుడ్లో ఉన్నాడని, తక్షణమే సర్జరీ చేయాలని మాయమాటలు చెబుతారు. తర్వాత సర్జరీకి డబ్బులు కట్టాలని కోరతారు. ఈమేకు లింక్ పంపిస్తారు. ఆ లింక్‌లను క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతా నుంచి నగదు గుల్ల చేస్తున్నారు. ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల్ప్‌కు స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. సైబర్ మోసాలపై కేంద్ర హోంశాఖ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు.
కొత్త తరహా సైబర్ మోసం.. జాగ్రత్త!!
➡️ మీ పిల్లలు రోడ్డు యాక్సిడెంట్ కు గురయ్యారని తల్లిదండ్రులకు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్
➡️ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారని, తక్షణమే సర్జరీ చేయాలంటూ మాయమాటలు
➡️ సర్జరీ కోసం వెంటనే డబ్బులు పంపాలంటూ లింకులను షేర్ చేస్తున్న కేటుగాళ్ళు… pic.twitter.com/9pAVcAsXmv
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) December 25, 2024