https://oktelugu.com/

Medchal: వసూళ్ల కోసం తహసీల్దార్ నే వాడేశాడు.. చివర్లో అదిరిపోయే ట్విస్ట్

Medchal హైదరాబాద్ శివారులో మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. మేడ్చల్ మండల పరిధిలో అనేక గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 27, 2024 / 04:14 PM IST

    Medchal

    Follow us on

    Medchal: శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అనే సామెతను మీరు వినే ఉంటారు కదా.. ఆ సామెతను ఇతడు నిజం చేసి చూపించాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలని కలలుగన్నాడు. అందుకోసం ఏకంగా తన మండలానికి చెందిన తహసీల్దార్ పేరు ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. అప్పటికి ఎనిమిది లక్షలు సంపాదించాడు. అంతకుమించి సంపాదించాలనే ఆలోచనతో ఒక స్కెచ్ వేశాడు. కాకపోతే రోజులన్నీ ఒకే తీరుగా ఉండవు కదా.. అతడి ప్లాన్ తిరగబడింది. చివరికి జైలు పాలు చేసింది

    హైదరాబాద్ శివారులో మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంటుంది. మేడ్చల్ మండల పరిధిలో అనేక గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. అయితే ఇందులో చాలా వాటికి అనుమతులు లేవు. రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటారు. ఇలా మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామంలో గంగస్థాన్ అనే పేరుతో ఓ స్థిరాస్తి వ్యాపారి రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేశాడు. ఆ వ్యాపారి పేరు బీఎల్ రెడ్డి.. అయితే అతడి వద్దకు మేడ్చల్ మండలం పూడూరు గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి వెళ్ళాడు.. “నేను తహసీల్దార్ పంపిస్తే మీ దగ్గరికి వచ్చాను. మేడం మిమ్మల్ని డబ్బులు ఇవ్వమన్నారని” అతడు అడిగాడు. మేడం నిజంగానే పంపించారు కావచ్చనుకుని బీఎల్ రెడ్డి 8 లక్షలు మహేందర్ రెడ్డి కి ఇచ్చాడు.. ఆ తర్వాత కొద్ది రోజులకు అదే వెంచర్ దగ్గరికి మహేందర్ రెడ్డి వెళ్ళాడు.. ఆ సమయంలో బిఎల్ రెడ్డి అక్కడే ఉన్నాడు..”మీ వెంచర్ కు అనుమతులు లేవట. పై అధికారులు అడుగుతున్నారు.. దాదాపు మూడు కోట్ల దాకా ఇవ్వాలంటున్నారు. లేకపోతే వెంచర్ పనులు నిలిపివేయాలని చెబుతున్నారు. మీరు త్వరగా డబ్బు సర్దుబాటు చేసుకోండి” అంటూ మహేందర్ రెడ్డి బిఎల్ రెడ్డిని బెదిరించాడు..

    దీంతో బిఎల్ రెడ్డి తనకు కొంచెం గడువు కావాలని మహేందర్ రెడ్డిని అడిగాడు. దానికి అతడు ఒకే చెప్పాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని బిఎల్ రెడ్డి మేడ్చల్ తహసీల్దార్ శైలజను కలిసి చెప్పాడు.. దీంతో ఆమె మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మహేందర్ రెడ్డి పై ఫిర్యాదు చేసింది.. తన పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఈ విషయం తెలియని మహేందర్ రెడ్డి బీఎల్ రెడ్డికి ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు.. డబ్బులు ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.. అయితే ఆ తర్వాత పోలీసులకు ఈ విషయాన్ని బీఎల్ రెడ్డి చెప్పడంతో.. వారు రంగంలోకి దిగారు. మహేందర్ రెడ్డిని అరెస్టు చేశారు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.