Coimbatore Case: దక్షిణాదిలో కీలక రాష్ట్రమైన తమిళనాడులో జరుగుతున్న సంఘటనలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది తొక్కిసలాట జరిగి దాదాపు 40 మంది దాకా చనిపోయారు. ఇప్పటికీ తమిళనాడు రాజకీయాలలో చర్చకు దారితీస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై ఏకంగా సుప్రీంకోర్టు దాకా టీవీకే వెళ్లింది. ఈ కేసుకు సంబంధించి విచారణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాకుండా సిబిఐతో జరిపించాలని డిమాండ్ చేసింది. దానికి తగ్గట్టుగానే సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఇక ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ ప్రాంతంలో ఓ కాలేజీ విద్యార్థిని పై ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడ్డారు. సామూహికంగా ఆకృత్యం చేశారు. ఈ ఘటన ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో కలకలం రేపుతోంది.. కోయంబత్తూరు లోని కు కాలేజీ విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళింది. ఈ క్రమంలో శివగంగ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తవసి, కరుప్ప స్వామి, కాళేశ్వరన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య, దోపిడీ, ఇంకా అనేక రకాలైన ఐదు కేసులను నమోదు చేశారు. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆ యువతి, ఆమె స్నేహితుడు కారు ఆపి మాట్లాడుకుంటున్నారు.. అప్పటికే సమయం అర్ధరాత్రి కావస్తోంది. ఈ సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ కారును చుట్టుముట్టారు. ఆ తర్వాత ఆమె స్నేహితుడిని దారుణంగా కొట్టారు. ఆ యువతిని కారు నుంచి బయటికి లాగి.. ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ ఆమెపై దారుణానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు మీద వదిలి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెకు ఆసుపత్రిలో చికిత్స జరిపించి.. జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను కనుక్కున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత ఈశ్వరన్ అనే డీఎంకే కూటమి పార్టీ ఎమ్మెల్యే దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అర్ధరాత్రి సమయంలో ఆడ మగ బయటకి కలిసి వెళ్తే ఇలాంటి దారుణాలు జరుగుతాయని పేర్కొన్నారు.. అందువల్లే అర్ధరాత్రి సమయం కాకుండా.. ఏదైనా పని మీద బయటకు వెళ్తే వెంటనే ముగించుకొని రావాలని సూచించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాలలో సంచలనం సృష్టించాయి. మరోవైపు ప్రతిపక్ష అన్నా డిఎంకె ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తోంది. టీవికే కూడా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది. డీఎంకే పరిపాలన కాలంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని టీ వీ కే నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకుందని డీఎంకే నేతలు అంటున్నారు. ఒక మహిళపై దారుణం జరిగితే దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడం సిగ్గుచేటని వారు పేర్కొంటున్నారు.